Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177004
            [news_title_telugu_html] => 

20 రోజులు.. 850 టీఎంసీలు

[news_title_telugu] => 20 రోజులు.. 850 టీఎంసీలు [news_title_english] => [news_short_description] => ఎగువ నుంచి వరద తగ్గడంతో జూరాల, శ్రీశైలం గేట్లు మూత పడ్డాయి. జులై 31న జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయగా, ఆగస్టు తొమ్మిదిన శ్రీశైలం గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
20 రోజులు.. 850 టీఎంసీలు - EENADU
close
20 రోజులు.. 850 టీఎంసీలు

 ఆగస్టులో ఇంత ప్రవాహం..  శ్రీశైలం చరిత్రలో రెండోసారి
 2006-07లో 1054 టీఎంసీలు
ఈనాడు - హైదరాబాద్‌

ఎగువ నుంచి వరద తగ్గడంతో జూరాల, శ్రీశైలం గేట్లు మూత పడ్డాయి. జులై 31న జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయగా, ఆగస్టు తొమ్మిదిన శ్రీశైలం గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో ఈ రెండు ప్రాజెక్టుల నుంచి గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేసి విద్యుదుత్పత్తి ద్వారానే బుధవారం దిగువకు వదిలారు. ఇరవై రోజుల్లో శ్రీశైలంలోకి 850 టీఎంసీలు వచ్చాయి. ఆగస్టులో ఇంత అత్యధిక ప్రవాహం రావడం జలాశయం చరిత్రలో ఇది రెండోసారి. 1967-68 నుంచి శ్రీశైలం వద్ద నెలల వారీగా వచ్చిన ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2006-07 సంవత్సరం ఆగస్టు నెలలో 1054 టీఎంసీల నీరు వచ్చింది. దీనిని అధిగమించాలంటే వచ్చే పది రోజుల్లో మరో 204 టీఎంసీలు రావాల్సి ఉంటుంది. ఆలమట్టి లేదా తుంగభద్రకు మళ్లీ భారీ వరద వస్తేనే ఇది సాధ్యమవుతుంది.
జులై 30న జూరాలలో విద్యుదుత్పత్తి చేసి దిగువకు విడుదల చేయగా, జులై 31న గేట్లు ఎత్తి నీటిని వదిలారు. జూరాలలోకి మొత్తం 800 టీఎంసీల నీరు వచ్చింది. జూరాల ఆయకట్టుతోపాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, 9.357 టీఎంసీలు ఉంది. బుధవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి జూరాల విద్యుత్తు కేంద్రం ద్వారా 32,712 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి వచ్చే నీరు సుంకేశుల వద్ద 22,613 క్యూసెక్కులు కలిపి 55,325 క్యూసెక్కులు దిగువకు వస్తోంది. దీంతో రాత్రికి శ్రీశైలంలోకి ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉండటంతో గేట్లు మూసేశారు.

10 లక్షల క్యూసెక్కుల విడుదల
కుడి, ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, కల్వకుర్తి, హంద్రీనీవా ఎత్తిపోతల పథకాలకు కలిపి లక్షా పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, 884.90 అడుగుల మేర నీరు ఉంది. పూర్తిస్థాయిలో 215 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. దిగువన నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ అన్నీ పూర్తి స్థాయి నిల్వలతో ఉన్నాయి. తుంగభద్రకు కూడా ఈ సంవత్సరం ఆగస్టులో 190 టీఎంసీలు వచ్చింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.