Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177010
            [news_title_telugu_html] => 

మ్యుటేషన్ల బాధ్యత జేసీ లేదా ఆర్డీఓకు?

[news_title_telugu] => మ్యుటేషన్ల బాధ్యత జేసీ లేదా ఆర్డీఓకు? [news_title_english] => [news_short_description] => రాష్ట్రంలో భూ వివాదాలు, సమస్యలకు ప్రధాన కారణం శాఖల మధ్య సమన్వయలోపమేనని పలువురు కలెక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. రెవెన్యూ, స్టాంపులు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
మ్యుటేషన్ల బాధ్యత జేసీ లేదా ఆర్డీఓకు? - EENADU
close
మ్యుటేషన్ల బాధ్యత జేసీ లేదా ఆర్డీఓకు?

 రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల   మధ్య సమన్వయలోపం
 భూ సమస్యలకు  ఇదే ప్రధాన కారణం
 వీఆర్వోల వ్యవస్థలో మార్పులు
కలెక్టర్ల సమావేశంలో చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూ వివాదాలు, సమస్యలకు ప్రధాన కారణం శాఖల మధ్య సమన్వయలోపమేనని పలువురు కలెక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖల మధ్య అంతరం వల్ల.. రెవెన్యూ సమస్యలు తీవ్రమవుతున్నాయని వారంటున్నారు. ఈ శాఖల మధ్య సమన్వయం పెంచడానికి ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొంటున్నారు. ప్రధానంగా రెవెన్యూ-రిజిస్ట్రేషన్‌ సమన్వయంతో చాలా వివాదాలకు ముగింపు పలకవచ్చని హైదరాబాద్‌, చుట్టుపక్కల జిల్లాల కలెక్టర్ల ఉద్దేశంగా ఉంది.

మ్యుటేషన్‌ విధానంపై చర్చ
ప్రస్తుతమున్న మ్యుటేషన్‌ విధానంలో మార్పులపై కలెక్టర్లు చర్చించారు. తహసీల్దార్‌లు మ్యుటేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తుండగా దీన్ని జాయింట్‌ కలెక్టర్‌ లేదా ఆర్డీఓల పరిధిలోకి తెస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది ఆచరణ సాధ్యమా? కాదా? అనే అంశంపై మరింత దృష్టి సారించాలనే చర్చ జరగ్గా జేసీలు, ఆర్డీఓలకు పని ఒత్తిడితో ఇది ఎంతవరకూ సాధ్యమవుతుందనేది చూడాలని కొందరు కలెక్టర్లు సీఎం సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం.

20 శాతం సమస్యలు ఎందుకు పరిష్కరించడంలేదు
మొత్తంగా 80 శాతం రెవెన్యూ సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో మిగిలిన 20 శాతం సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయని కలెక్టర్లను ముఖ్యమంత్రి ప్రశ్నించినట్లు తెలిసింది. భూవివాదాల వల్లే చాలా సమస్యలు కొలిక్కి రాలేదని పలువురు కలెక్టర్లు చెప్పారు. వీఆర్వోలలో అర్హులను రెవెన్యూశాఖలో కొనసాగిస్తూ మిగిలిన వారి సేవలను వేరే రూపంలో ఉపయోగించుకుంటే ఎలాఉంటుందన్న అంశంపై చర్చ జరిగింది. వీరిని పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోకి తీసుకురావాలనే అభిప్రాయంపైనా మాట్లాడారు. భూముల సమగ్ర సర్వే సబ్‌ డివిజన్‌ చేస్తేనే భూ సమస్యలు చాలా వరకూ పరిష్కారమవుతాయని కలెక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్వే, భూరికార్డులశాఖ నిర్వహిస్తున్న విధులపై చర్చ జరిగింది. శాఖ పనితీరులో సమూల మార్పులు, సర్వేకు ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగించే అంశం పరిశీలనకు వచ్చింది. భూముల సమగ్ర సర్వే అనంతరమే భూములకు కన్‌క్లూజివ్‌ టైటిల్‌ వ్యవస్థ తీసుకురావడం సాధ్యమవుతుందని కలెక్టర్లు సమావేశంలో చెప్పారు.

కొత్త చట్టంపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ!
రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా రూపకల్పనకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా కలెక్టర్ల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.