Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177013
            [news_title_telugu_html] => 

రఫేల్‌ రాకకు రంగం సిద్ధం

[news_title_telugu] => రఫేల్‌ రాకకు రంగం సిద్ధం [news_title_english] => [news_short_description] => రఫేల్‌ యుద్ధవిమానాల రాకకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలోనే భారత్‌ అమ్ముల పొదిలో చేరనున్నాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా వచ్చే నెలలో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు వెళ్లి తొలి విమానాన్ని స్వీకరించనున్నారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
రఫేల్‌ రాకకు రంగం సిద్ధం - EENADU
close
రఫేల్‌ రాకకు రంగం సిద్ధం

 వచ్చే నెలలో భారత్‌   అమ్ములపొదిలో చేరనున్న  యుద్ధ విమానాలు
 ఫ్రాన్స్‌కు వెళ్లనున్న  రాజ్‌నాథ్‌, ధనోవా

ఈనాడు, దిల్లీ: రఫేల్‌ యుద్ధవిమానాల రాకకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలోనే భారత్‌ అమ్ముల పొదిలో చేరనున్నాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా వచ్చే నెలలో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు వెళ్లి తొలి విమానాన్ని స్వీకరించనున్నారు. ఒకటి నుంచి నాలుగుదాకా యుద్ధ విమానాలను అప్పగించనున్నట్లు రక్షణశాఖ వర్గాల సమాచారం. సెప్టెంబర్‌ 20న నిర్వహించే కార్యక్రమంలో ఉన్నతస్థాయి సైనికాధికారులతోపాటు, రఫేల్‌ తయారీ సంస్థ డసౌ ఏవియేషన్‌ సీనియర్‌ ఉన్నతాధికారులు కూడా హాజరవనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై ఫ్రాన్స్‌ అధికారులతో చర్చించేందుకు భారత వైమానిక దళానికి ఉన్నతాధికారుల బృందం ఇప్పటికే పారిస్‌ చేరుకుంది. అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, పైలట్లకు శిక్షణ పూర్తిచేసి రఫేల్‌ యుద్ధవిమానాలకు స్వాగతం పలికేందుకు ఐఏఎఫ్‌ సంసిద్ధంగా ఉంది. హరియాణాలోని అంబాలా, పశ్చిమబెంగాల్‌లోని హసిమరలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లలో వీటిని మోహరించనున్నట్లు తెలుస్తోంది. వీటిని భారత్‌కు అవసరమైన నిర్దిష్టమైన మార్పులతో రూపొందినట్లు సమాచారం. రూ.58 వేల కోట్ల వ్యయంతో 36 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకొన్న సంగతి తెలిసిందే. అణు సామర్థ్యం ఉన్న ఈ విమానాలు గగనతలం నుంచి గగనతలంపైకి, గగనతలం నుంచి భూతలంపైకి దాడులు చేయగలవు.


గగనవీధుల్లో అభినందన్‌
మిగ్‌21ను నడిపిన వింగ్‌కమాండర్‌

దిల్లీ: భారత్‌, పాక్‌ల మధ్య వైమానిక పోరాటంలో సంచలనానికి కేంద్రబిందువైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ తిరిగి మిగ్‌ 21 యుద్ధవిమానాన్ని నడిపారు. ఫిబ్రవరి 27న జరిగిన భారత్‌, పాక్‌ గగనతల పోరులో పాక్‌కు చెందిన ఎఫ్‌-16 జెట్‌ను నేలకూల్చి, తన యుద్ధవిమానం దాడికి గురవడంతో కిందికి దూకి, పాక్‌ చేతికి చిక్కి విడుదలైన అభినందన్‌ సుమారు ఆరు నెలల తర్వాత కాక్‌పిట్‌ ఎక్కారు. రాజస్థాన్‌లోని ఐఏఎఫ్‌ బేస్‌లో పని చేస్తున్న ఆయన విమానం నడపడం ప్రారంభించినట్లు సైనిక ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అభినందన్‌కు వీర్‌చక్ర అవార్డు సైతం ప్రకటించారు. బెంగళూరులోని ఐఏఎఫ్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌ అభినందన్‌ యుద్ధవిమానం నడిపేందుకు మూడు వారాల క్రితమే పచ్చజెండా ఊపింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.