Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177015
            [news_title_telugu_html] => 

బీమా లేనివారికీ ఈఎస్‌ఐ వైద్య సేవలు

[news_title_telugu] => బీమా లేనివారికీ ఈఎస్‌ఐ వైద్య సేవలు [news_title_english] => [news_short_description] => బీమా లేని అసంఘటిత రంగ కార్మికులకు సైతం ఇకనుంచి ఈఎస్‌ఐ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని కేంద్ర కార్మిక, ఉపాధికల్పనా శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ వెల్లడించారు. కార్మిక రాజ్య బీమా(ఈఎస్‌ఐ) సంస్థ ఆధ్వర్యంలో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
బీమా లేనివారికీ ఈఎస్‌ఐ వైద్య సేవలు - EENADU
close
బీమా లేనివారికీ ఈఎస్‌ఐ వైద్య సేవలు

 అసంఘటిత రంగ  కార్మికులకు అవకాశం
 కేంద్ర కార్మిక, ఉపాధికల్పనా శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: బీమా లేని అసంఘటిత రంగ కార్మికులకు సైతం ఇకనుంచి ఈఎస్‌ఐ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని కేంద్ర కార్మిక, ఉపాధికల్పనా శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ వెల్లడించారు. కార్మిక రాజ్య బీమా(ఈఎస్‌ఐ) సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల ప్రాంగణంలో నూతన ఓపీడీ బ్లాక్‌ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఈఎస్‌ఐ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని, వైద్య కళాశాలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా గంగ్వార్‌ మాట్లాడుతూ.. రూ.10 కన్సల్టేషన్‌ ఫీజు, నామమాత్ర ఛార్జీలు చెల్లించి అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా ఈఎస్‌ఐ సేవలు పొందే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు చెల్లించే ఈఎస్‌ఐ పైకాన్ని 4.75 శాతం నుంచి 4.3 శాతానికి, కార్మికుల నుంచి మినహాయించుకునే సొమ్మును 1.75 నుంచి 0.75కి తగ్గించామన్నారు.  కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించనున్న ఓపీడీ బ్లాక్‌ ద్వారా మరో 200 పడకలతోపాటు ఈఎన్‌టీ, ఆడియో, స్పీచ్‌ థెరపీ, రేడియాలజీ తదితర ఆధునిక విభాగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య మరింత పెంచాలని, మేడ్చల్‌లో 800 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు.కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎం.రామచందర్‌రావు పాల్గొన్నారు.


ఏపీ రాజధాని అంశం మా పరిధిలోనిది కాదు : కిషన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మారబోతుందనే విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోదని, ఈ అంశం తమ పరిధిలోనిది కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.  బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికలు తమ లక్ష్యం కాదని, 2023 సాధారణ ఎన్నికల బరిలో సత్తా చాటడమే ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా ఎవరో తనకు తెలియదనడం కేటీఆర్‌ అహంకారపూరిత స్వభావానికి నిదర్శనమన్నారు. నడ్డా ఎవరో తెలియదన్న కేటీఆర్‌ గతంలో ఆయనను ఎలా కలిశారని ప్రశ్నించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.