Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177705
            [news_title_telugu_html] => 

శిలీంధ్రాల వ్యాధి బాధితులకు ఉపశమనం 

[news_title_telugu] => శిలీంధ్రాల వ్యాధి బాధితులకు ఉపశమనం  [news_title_english] => [news_short_description] => శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనేలా ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు ముందడుగు వేశారు. నోటి మాత్రల రూపంలో తీసుకున్న ఔషధం కొద్ది కొద్దిగా శరీరంలోకి విడుదలయ్యే విధానాన్ని వీరు కనిపెట్టారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/QyT1y7lAzt8 [news_videoinfo] => |https://www.youtube.com/embed/QyT1y7lAzt8 [news_sections] => ,27,26, ) )
శిలీంధ్రాల వ్యాధి బాధితులకు ఉపశమనం  - EENADU
close
శిలీంధ్రాల వ్యాధి బాధితులకు ఉపశమనం 

నోటి మాత్రల ద్వారా ఔషధం తీసుకునే అవకాశం 
హైదరాబాద్‌ ఐఐటీ పరిశోధకుల ముందడుగు

ఈనాడు, సంగారెడ్డి: శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనేలా ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు ముందడుగు వేశారు. నోటి మాత్రల రూపంలో తీసుకున్న ఔషధం కొద్ది కొద్దిగా శరీరంలోకి విడుదలయ్యే విధానాన్ని వీరు కనిపెట్టారు. దీనివల్ల ఔషధాన్ని పూర్తిస్థాయిలో సమర్థంగా వినియోగించుకునే అవకాశంతో బాధితులకు ఉపశమనం లభిస్తుంది. వీరి పరిశోధన ఫలితాలు ‘నానో స్ట్రక్చర్స్‌, నానో ఆబ్జెక్ట్స్‌’ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. ఫంగల్‌ ఇన్ఫెక్షన్లతోపాటు కాలాఅజార్‌(బ్లాక్‌ ఫీవర్‌) చికిత్స కోసం ఆంఫోటెరిసిన్‌ బి ఔషధాన్ని వాడుతుంటారు. ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతోపాటు శరీరానికి అందే శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఇంజక్షన్‌ రూపంలో తీసుకుంటే అది సమర్థంగా ఇన్ఫెక్షన్లను తగ్గించలేకపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో నోటి మాత్రల రూపంలో తీసుకునే ఔషధం నియంత్రిత పద్ధతిలో కొద్ది కొద్దిగా విడుదలయ్యేలా ఐఐటీ హైదరాబాద్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్యులు డాక్టర్‌ సప్తర్షి మజుందార్‌, డాక్టర్‌ చంద్రశేఖర్‌శర్మలు పరిశోధనలు సాగించారు. డాక్టర్‌ అనిందితా లాహా, పరిశోధక విద్యార్థిని మృణాళిని ఇందులో భాగస్వాములయ్యారు. ఆహార, ఔషధ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న జెలటిన్‌ పాలిమర్‌ను వీరు ఎంచుకున్నారు. అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ ఈ పాలిమర్‌ను ఆమోదించింది. ఈ పాలిమర్‌లో ఆంఫోటెరిసిన్‌ బి ఔషధాన్ని ఉంచి ఎలక్ట్రోస్పిన్నింగ్‌ విధానం ద్వారా నానో ఫైబర్స్‌ను అభివృద్ధి చేశారు. వీటిని క్రాస్‌లింక్‌ చేసిన అనంతరం మాత్రలుగా తయారు చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.