Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177712
            [news_title_telugu_html] => 

అరెస్టు తీరు అప్రజాస్వామికం 

[news_title_telugu] => అరెస్టు తీరు అప్రజాస్వామికం  [news_title_english] => [news_short_description] => కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని అవమానకర రీతిలో అరెస్టు చేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను వ్యక్తిగత కక్షలు తీర్చుకునే విభాగాలుగా మార్చిందని ఆరోపించాయి. అరెస్టుకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు జరిపారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
అరెస్టు తీరు అప్రజాస్వామికం  - EENADU
close
అరెస్టు తీరు అప్రజాస్వామికం 

మండిపడ్డ విపక్షాలు

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని అవమానకర రీతిలో అరెస్టు చేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను వ్యక్తిగత కక్షలు తీర్చుకునే విభాగాలుగా మార్చిందని ఆరోపించాయి. అరెస్టుకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు జరిపారు.

ప్రజాస్వామ్యం విలపిస్తోంది 
నేను కేసులోని చట్టపరమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. అరెస్టు చేసిన తీరు సరికాదు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం కనిపించకుండా పోయింది. అది ఇప్పుడు విలపిస్తోంది. న్యాయవ్యవస్థ దాన్ని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. మీడియా భాజపా అధికార ప్రతినిధిగా మారింది.

- మమతా బెనర్జీ

దేశానికి అవమానకరం 
ఇది రాజకీయ కక్షసాధింపే. సీబీఐ అధికారులు గోడలు ఎక్కి చిదంబరం ఇంట్లోకి వెళ్లడం ఏమిటి? ఇది దేశానికి అవమానకరం.

-స్టాలిన్‌, డీఎంకే అధిపతి

వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికే.. 
వ్యక్తిగత, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే  చిదంబరాన్ని పీడించి, విచారణ జరుపుతున్నారు. సీబీఐ, ఈడీలను వ్యక్తిగత కక్షలు తీర్చుకొనే విభాగాలుగా మార్చారు.

-రణదీప్‌ సుర్జేవాలా, కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి

ఇంత హైడ్రామా అవసరమా? 
చట్టం తనంతట తానుగా పనిచేసుకుంటూ పోవాలి. అరెస్టు చేయడానికి ఇంత హైడ్రామా నడపడం పూర్తిగా అ భ్యంతరకరం.

-సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

అవినీతికి కాంగ్రెస్‌ మద్దతు 
చిదంబరాన్ని వెనకేసుకురావడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి మద్దతు ఇచ్చినట్టయింది. దేశాన్ని దోచుకోవడమే ఆ పార్టీ విధానం.  దర్యాప్తు సంస్థల వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం.

- ప్రకాశ్‌ జావ్‌డేకర్‌, కేంద్రప్రసార, సమాచార శాఖ మంత్రి

 

దర్యాప్తు సంస్థలకు సహకరించనందుకే అరెస్టు 
హైదరాబాద్‌: దర్యాప్తు సంస్థలకు సహకరించకపోవడం వల్లనే చిదంబరాన్ని అరెస్టు చేయాల్సి వచ్చింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం ఎవరి నుంచి, ఏ బ్యాంకు ద్వారా లంచం తీసుకున్నారన్నది నిర్ధారించే సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి.

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి

 

ఖైదీలైన కీలక నేతలు 

దిల్లీ: వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయిన కీలక నేతల జాబితాలో కాంగ్రెస్‌ సీనియర్‌ పి.చిదంబరం (73) చేరారు. గతంలో పలు ఆరోపణలపై నిందితులుగా జైల్లో ఉన్న, అనంతరం శిక్షలు ఖరారై దోషులుగా జైలు శిక్ష అనుభవించిన ప్రముఖ నాయకుల వివరాలను పరిశీలిస్తే....

లాలు ప్రసాద్‌ (71): బిహార్‌ ముఖ్యమంత్రిగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన లాలు దాణా కుంభకోణం కేసులో ప్రస్తుతం రాంచీ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మూడు శిక్షల్లో ఆయనకు 14 ఏళ్ల శిక్ష పడింది. 
జయలలిత (68): వెల్లడించిన ఆదాయానికి మించి రూ.66.65 కోట్లు కలిగి ఉన్నారంటూ భాజపా నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నడిచింది. ఆమెకు, సహచరి శశికళతో పాటు మరో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. బెంగళూరు సెంట్రల్‌ జైలులో జయలలిత 21 రోజుల పాటు శిక్ష అనుభవించిన అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. 
బంగారు లక్ష్మణ్‌ (74): ఊహాజనిత ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో రూ.లక్ష లంచం తీసుకున్నారన్న ఆరోపణపై భాజపా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్‌కు దిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 
ఎ.రాజా (55): 2-జీ టెలికాం కుంభకోణంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై డీఎంకే నాయకుడు, కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా 15 నెలల పాటు దిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్నారు. అనంతరం ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టివేసింది. 
కనిమొళి (51): డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి కుమార్తె అయిన కనిమొళి 2-జీ కుంభకోణం కేసులో ఆరు నెలల పాటు జైలులో ఉన్నారు. ఈ కేసును కూడా కోర్టు కొట్టివేసింది. 
బి.ఎస్‌.యడియూరప్ప (76): కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల గుర్తింపు రద్దు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని లోకాయుక్త కోర్టు పేర్కొనడంతో 25 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు. 
సురేశ్‌ కల్మాడి (75): కామన్‌వెల్త్‌ క్రీడల్లో అక్రమాలకు పాల్పడడంతో కాంగ్రెస్‌ నాయకుడు, ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు సురేష్‌ కల్మాడీ తొమ్మిది నెలలపాటు దిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్నారు. 
అమర్‌ సింగ్‌ (63): ఓటుకు నోటు కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడైన అమర్‌ సింగ్‌ 13 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. 
మధు కోడా (48): గనుల కుంభకోణంలో ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. రాంచీలోని జైలులో శిక్ష అనుభవించారు. 
వై.ఎస్‌.జగన్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు 2012లో వై.ఎస్‌. జగన్‌ అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో 16 నెలల పాటు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.