Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177724
            [news_title_telugu_html] => 

అమరావతిపై మాటల యుద్ధం

[news_title_telugu] => అమరావతిపై మాటల యుద్ధం [news_title_english] => [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. అమరావతి అంతా పల్లపు ప్రాంతం కావటంతో అక్కడ నిర్మాణాలకు లక్షకు లక్ష అదనంగా ఖర్చవుతోంది, పైగా అది సురక్షిత ప్రాంతం కాదని [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
అమరావతిపై మాటల యుద్ధం - EENADU
close
అమరావతిపై మాటల యుద్ధం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. అమరావతి అంతా పల్లపు ప్రాంతం కావటంతో అక్కడ నిర్మాణాలకు లక్షకు లక్ష అదనంగా ఖర్చవుతోంది, పైగా అది సురక్షిత ప్రాంతం కాదని కమిటీ ఎప్పుడో చెప్పింది కాబట్టి దీనిపై అన్నీ ఆలోచించే తుది నిర్ణయం తీసుకుంటామంటూ సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

మంత్రి వ్యాఖ్యలపై నేతలంతా తలోమాటా అంటుండటంతో అమరావతిపై అనుమానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనిపై గురువారం విపక్ష నేత చంద్రబాబు స్పందిస్తూ రాజధాని ఉనికి లేకుండా చేసేందుకే ప్రభుత్వం అమరావతి విషయంలో కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఈ కుట్రను శనివారం తాను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించనున్నట్లు ప్రకటించారు. అమరావతిపై వైకాపా ప్రభుత్వం దుష్టరాజకీయాలు చేస్తోందని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా ధ్వజమెత్తారు. మరోవైపు రాష్ట్ర రాజధానిని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, బొత్స వ్యాఖ్యలను అంతా వక్రీకరిస్తున్నారంటూ రాష్ట్ర జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌, పరిశ్రమల మంత్రి గౌతమ్‌ రెడ్డి,  పౌరసరఫరాల మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) వ్యాఖ్యానించటం విశేషం.

ఉనికి లేకుండా చేసేందుకే: చంద్రబాబు 
అమరావతికి ఉనికి లేకుండా చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజధాని ప్రాంతాన్ని ముంచేందుకు కుట్రలు పన్నటం ఇందులో భాగమే. దీనిలో అమాయక ప్రజలు పావులు కావటమే దురదృష్టకరం. నేను ఉంటున్న ఇంట్లోకి నీళ్లు రప్పించాలన్న దురుద్దేశంతో వేలాది మందిని నిరాశ్రయులను చేశారు. ఇది ప్రభుత్వం కావాలని సృష్టించిన ‘మ్యాన్‌ మేడ్‌’ విపత్తు కాబట్టి ఈ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వ కుట్రలేమిటో శనివారం పవర్‌పాయింట్‌ ద్వారా బహిర్గతం చేస్తా.

రాజధానిపై దుష్టరాజకీయాలు: ఎంపీ గల్లా జయదేవ్‌ 
అమరావతిపై వైకాపా ప్రభుత్వం దుష్టరాజకీయాలకు తెరలేపింది. మంత్రి బొత్స వ్యాఖ్యలు చూస్తుంటే అసలీ ప్రభుత్వానికి రాజధానిని నిర్మించే ఆలోచన ఉందో లేదో కూడా అర్థం కావటం లేదు. దీనిపై సీఎం స్పష్టత ఇవ్వాలి. వరద సహాయక చర్యల్లో విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకే అమరావతిపై బురద రాజకీయాలు చేస్తోంది.

అపోహలన్నీ ప్రతిపక్షాల సృష్టే: మంత్రి గౌతమ్‌రెడ్డి 
రాష్ట్ర రాజధాని అమరావతే, ఈ విషయంలో ఎలాంటి అపోహలూ వద్దు. పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను తెదేపా పనిగట్టుకునే వక్రీకరించింది.

ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం: మంత్రి అనిల్‌ యాదవ్‌ 
ఇటీవల వచ్చిన వరదలను చంద్రబాబు ‘మ్యాన్‌ మేడ్‌’ విపత్తు అనటం హాస్యాస్పదం. రాష్ట్ర రాజధానిని మారుస్తామన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు.

ముంపునకు బాధ్యత గత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స సత్యనారాయణ 
అమరావతి ముంపునకు గత ప్రభుత్వ నిర్ణయాలే కారణం. వాళ్లు శివరామకృష్ణ కమిటీ నివేదికను విస్మరించటం వల్లనే నేడు రాజధాని ముంపు బారినపడింది. చిన్నపాటి వరదలకే ఇలా మునిగితే 2009 నాటి వరద పరిస్థితి పునరావృతమైతే ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవాలి.

అన్నీ విపరీత అర్థాలే: మంత్రి కొడాలి నాని 
అమరావతి విషయంలో బొత్స వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు. తెదేపా నాయకులే విపరీత అర్థాలు తీసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.