Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177752
            [news_title_telugu_html] => 

విపక్షాలది అసహనం 

[news_title_telugu] => విపక్షాలది అసహనం  [news_title_english] => [news_short_description] => తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గురువారం విపక్షాలపై విరుచుకుపడ్డారు. అవి చాలా అసహనంతో ఉన్నాయన్నారు. ప్రజాబలం లేక నిందారోపణలతో కాలం వెళ్లబుచ్చుతున్నాయని ధ్వజమెత్తారు. అలాంటివాటికి గట్టిగా జవాబివ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదులో కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌ 90,575 సభ్యత్వాలతో అగ్రభాగాన ఉన్నట్టు ప్రకటించారు.   [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/L2qJLlRBAhU [news_videoinfo] => |https://www.youtube.com/embed/L2qJLlRBAhU [news_sections] => ,27,26, ) )
విపక్షాలది అసహనం  - EENADU
close
విపక్షాలది అసహనం 

వాటికి ప్రజాబలం లేదు 
నిందారోపణలు చేస్తున్నాయి 
పుర ఎన్నికల్లో ఆ పార్టీలను చిత్తు చేయాలి: కేటీఆర్‌

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గురువారం విపక్షాలపై విరుచుకుపడ్డారు. అవి చాలా అసహనంతో ఉన్నాయన్నారు. ప్రజాబలం లేక నిందారోపణలతో కాలం వెళ్లబుచ్చుతున్నాయని ధ్వజమెత్తారు. అలాంటివాటికి గట్టిగా జవాబివ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదులో కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌ 90,575 సభ్యత్వాలతో అగ్రభాగాన ఉన్నట్టు ప్రకటించారు.  

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన శక్తిగా ఎదిగిందని, 60 లక్షల సభ్యత్వాలను నమోదు చేసిందని, తమకు దరిదాపుల్లో ఏ పార్టీ లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెల్లడించారు. విపక్ష పార్టీల్లో అసహనం పెరిగిందని, తెరాసపై నిందారోపణలు చేస్తున్నాయని, పార్టీ శ్రేణులు వాటిని తిప్పికొట్టాలన్నారు. వచ్చే పురపాలక ఎన్నికల్లో తెరాస సత్తా చాటాలని, జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల మాదిరే విజయాలు సాధించాలని ఉద్బోధించారు. ఈ నెలాఖరునాటికి అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయాలన్నారు. సెప్టెంబరులో నియోజకవర్గ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తామని వివరించారు.


 

దసరా నాటికి 20 జిల్లాల్లో కార్యాలయాలు సిద్ధమవుతాయని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటిని ప్రారంభిస్తారని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన పార్టీ సభ్యత్వ నమోదును సమీక్షించారు. పార్టీ ఇన్‌ఛార్జులు 69 మంది ఇందులో పాల్గొన్నారు. తెరాస సంస్థాగతంగా బలపడిందని సభ్యత్వ నమోదుకు మంచి స్పందన లభించిందని కేటీఆర్‌ అన్నారు. ‘‘ప్రతి నియోజకవర్గానికి సగటున 50 వేల మంది చొప్పున సభ్యత్వాలు నమోదయ్యాయి. ఏ పార్టీకీ ఇంత మంది సభ్యులు లేరు. సభ్యత్వ నమోదును విజయవంతం చేసిన ఇన్‌ఛార్జులను, ఎమ్మెల్యేలను అభినందిస్తున్నా. నమోదైన మొత్తం 60 లక్షల మందిలో 20 లక్షల మంది క్రియాశీల సభ్యులు. వీరు పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేస్తారు. వీరందరికీ గుర్తింపు కార్డులిస్తాం. పార్టీ కమిటీల్లో వీరే ఉంటారు. సభ్యత్వ రుసుం కింద ఇప్పటిదాకా రు.20.25 కోట్లు వచ్చింది. ఇంకా రూ.4.50 కోట్లు రావాలి. సభ్యత్వ నమోదు ప్రక్రియ గురువారంతో ముగిసింది. డిజిటలీకరణ కూడా పూర్తికావచ్చింది. బూత్‌, గ్రామ, మండల, బస్తీ, వార్డు కమిటీలను ఈ నెల 31 వరకు పూర్తి చేయాలి. అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలి. కమిటీలు, సంఘాల్లో 51 శాతం రిజర్వేషన్లను పాటించాలి. కమిటీల ఏర్పాటు పూర్తయిన నియోజకవర్గాల్లో నేను పర్యటిస్తా.

పురపాలక ఎన్నికలపై... 
రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజాదరణ కోల్పోయాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు కళకళలాడుతుంటే ప్రతిపక్షాలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రతీదాన్ని రాద్ధాంతం చేసేందుకు యత్నిస్తున్నాయి. వాటికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. పురపాలక ఎన్నికలు రాబోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్‌, భాజపాలను చిత్తు చేయాలి. ప్రతి పురపాలక సంఘాన్ని, కార్పొరేషన్‌ను గెలవాలి’’ అని కేటీఆర్‌ అన్నారు.

ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్‌భవ సాటి రాదు: కేటీఆర్‌ 
కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌భవ పథకం కంటే తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు మెరుగైందని  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో 77 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుండగా... ఆయుష్మాన్‌భవలో కేవలం 25 లక్షల కుటుంబాలకే అర్హత ఉంటుందని చెప్పారు. రెండు పథకాలను పోలుస్తూ ఆయన ట్విటర్‌లో వివరాలను అందించారు.


 ఎన్నికలు అడ్డుకునేందుకు విపక్షాల కుట్ర: పల్లా

తెలంగాణలో పురపాలక ఎన్నికలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, భాజపా కుట్రలు చేస్తున్నాయని శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో తెరాసను ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో అడ్డంకులు కల్పించేందుకు ఆ నాయకులు యత్నిస్తున్నారని.. గురువారం పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్ష సమావేశం  తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పురపాలక ఎన్నికలకు మేం సిద్ధంగాఉన్నాం. ఈ ఎన్నికలంటేనే ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. గెలిచేంత దమ్ము వాటికి లేదు. కేవలం గాలివాటంగానే లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని స్థానాలను అవి గెలుచుకున్నాయి. ఇక్కడ అమలవుతున్నన్ని పథకాలు సంఖ్యాపరంగా దేశంలో మరెక్కడా లేవు’’అని పల్లా పేర్కొన్నారు.

కేసీఆర్‌ నియోజకవర్గం అగ్రస్థానం 
సభ్యత్వ నమోదులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ అగ్రస్థానం పొందింది. పార్టీ ఎమ్మెల్యే లేని ములుగు నాలుగో స్థానంలో నిలవడంపై కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల 63,400 సభ్యత్వాలతో 12వ స్థానంలో నిలిచింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.