Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177758
            [news_title_telugu_html] => 

నవయుగతో ఒప్పందం రద్దుచెల్లదు 

[news_title_telugu] => నవయుగతో ఒప్పందం రద్దుచెల్లదు  [news_title_english] => [news_short_description] => పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు (పీహెచ్‌ఈపీ)పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులిచ్చింది. నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని రద్దుచేసుకుంటూ ఏపీజెన్‌కో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/YnQimsswbTo [news_videoinfo] => |https://www.youtube.com/embed/YnQimsswbTo [news_sections] => ,27,26, ) )
నవయుగతో ఒప్పందం రద్దుచెల్లదు  - EENADU
close
నవయుగతో ఒప్పందం రద్దుచెల్లదు 

ఏపీజెన్‌కో ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు 
పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు  రీటెండరింగ్‌పై ముందుకెళ్లొద్దని సూచన 
ఇతరులకు పనులు అప్పగించొద్దు 
రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదన్న న్యాయమూర్తి

ఈనాడు, అమరావతి: పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు (పీహెచ్‌ఈపీ)పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులిచ్చింది. నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని రద్దుచేసుకుంటూ ఏపీజెన్‌కో ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. జలవిద్యుత్‌ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే పిలిచిన రీటెండరింగ్‌ ప్రక్రియ ప్రకారం ముందుకు వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జెన్‌కోకు తేల్చిచెప్పింది. ఆ ప్రాజెక్ట్‌ పనులను ఇతరులకు అప్పగించొద్దని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిస్తూ తీర్పు ఇచ్చారు. ‘‘నవయుగతో ఒప్పందం రద్దు నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా లేదు.. అలాగే కాంట్రాక్టు నిబంధనల మేరకు ఏపీజెన్‌కో వ్యవహరించలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

ఆ అధికారం  ప్రభుత్వానికి లేదు 
నవయుగ సంస్థ, ఏపీజెన్‌కోల మధ్య ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ‘‘ఏపీ జెన్‌కో రాష్ట్ర ప్రభుత్వ శాఖనే అయినా, ప్రైవేటు సంస్థతో ఓ సారి ఒప్పందం కుదుర్చుకున్నాక ఆ ఒప్పందమే చెల్లుబాటు అవుతుంది. కమర్షియల్‌ కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమీక్ష చేసే హక్కు లేదు.

టెండర్‌ను రద్దు చేయాలని ఏపీ జెన్‌కోను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. మరీ ముఖ్యంగా కమర్షియల్‌ కాంట్రాక్ట్‌ విషయంలో రివర్స్‌ టెండర్‌ ప్రక్రియకు ఆదేశాలు ఇవ్వజాలదని’’ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా, ఒప్పందాన్ని.. అందులోని నిబంధనలను ఏపీ జెన్‌కో విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చట్టం, కాంట్రాక్టు నిబంధనలు అటువంటి ఉత్తర్వులు జారీచేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం లేదని పునరుద్ఘాటించింది.

నవయుగ విఫలమైందన్న నిర్ణయానికి రాలేం 
‘‘ టెండర్‌  రద్దు చేయాలని 2019 జులై 1న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిస్తే.. జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ జులై 19న లేఖ రాస్తూ అన్నిపనుల్ని నిలిపేయాలని నవయుగను ఆదేశించారు. ఆ లేఖకు నవయుగ సమగ్ర వివరాలతో తిరుగు సమాధానం ఇచ్చింది. ఆ లేఖ ద్వారా పనుల నిర్వహణలో గణనీయమైన పురోగతి కనిపిస్తోందని అర్థమవుతోంది. ఇంజినీరింగ్‌ పనుల్లో 98 శాతం, సివిల్‌ పనుల్లో 75 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రధానమైన యంత్ర సామగ్రి సరఫరా చేసేందుకు ఉపవిక్రేత అనుమతులు పొందారు. నిర్మాణం విషయంలోనూ పురోగతి ఉంది. నవయుగ ఇచ్చిన లేఖ పైనే ఆధారపడి అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఆ లేఖనే తాము పరిగణనలోకి తీసుకున్నాం. దాని ప్రకారం జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్వహణ పనుల్లో నవయుగ సంస్థ విఫలమైందనే నిర్ణయానికి రాలేం. మరోవైపు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ జెన్‌కో ఆగస్టు 18న రాసిన లేఖలో కూడా పనుల నిర్వహణలో విఫలమయ్యారనే ఆరోపణలు లేవు’’ అని హైకోర్టు అభిప్రాయపడింది.

ఏజీ వాదనతో ఏకీభవించలేం 
నవయుగ సంస్థ బ్యాంకు పూచీకత్తులను నగదుగా మార్చుకోకుండా జెన్‌కోను నిలువరించాలని కోరుతూ విజయవాడ కోర్టును ఆశ్రయించిందని, అదే కేసుతో ముడిపడి ఉన్న అంశంపై హైకోర్టును ఆశ్రయించటం సరికాదని ఏజీ చేసిన వాదనతో తాము ఏకీభవించటం లేదని కోర్టు పేర్కొంది.

ఒప్పందం రద్దుకు విధానాన్ని అనుసరించలేదు 
వాస్తవానికి ఒప్పందంలోని క్లాజ్‌ 13.1 ప్రకారం ఒప్పందం రద్దుకు నిర్దిష్ట విధానం ఉందని,  ఆ విధానాన్ని జెన్‌కో అనుసరించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ‘‘పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌’ పనులు ముగింపుదశకు తీసుకురావడంలో పిటిషనర్‌ సంస్థ విఫలమైనట్లు ఏపీ జెన్‌కోరాసిన లేఖ సారాంశంగా ఉంది. రాతి తవ్వకం చేపట్టడంలో నవయుగ ఉల్లంఘనలకు పాల్పడిందని జెన్‌కో భావించింది. దీని ప్రకారం ఒప్పందం రద్దు సరైనదిగా భావించింది. ఈ వాదన ఆకర్షణీయంగా కనిపిస్తున్నా, తగిన విధానాన్ని అనుసరించలేదు. ఏపీజెన్‌కో తీసుకున్న చర్యలు ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా లేవు. ఈ నిర్ణయం పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌(పీఈహెచ్‌పీ) ఒప్పందం రద్దుకు దారితీయడానికి వీల్లేదు’’అని హైకోర్టు అభిప్రాయపడింది.

తదుపరి ఆదేశాలిచ్చే వరకూ జెన్‌కో ఉత్తర్వుల సస్పెన్షన్‌ 
ప్రభుత్వ ఉత్తర్వులు... నవయుగ, జెన్‌కోల కాంట్రాక్టు నిబంధనల్ని అధిగమించేవి కాకూడదు. జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులను రీటెండర్‌ ప్రకటన ద్వారా ఇతరులకు అప్పగించే ప్రక్రియను నిలువరిస్తూ ఆదేశిస్తున్నాం. గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ ఆగస్టు 14న జారీచేసిన లేఖను తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు సస్పెండ్‌ చేస్తున్నాం’ అని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

80 మెగావాట్ల సామర్థ్యంతో 12 జలవిద్యుత్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం ఏపీ జెన్‌కోతో 2017 డిసెంబర్‌ 20న తాము చేసుకున్న ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేశారని పేర్కొంటూ నవయుగ సంస్థ డైరెక్టర్‌ వై.రమేశ్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం  విచారణ చేపట్టిన న్యాయమూర్తి గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.