Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177764
            [news_title_telugu_html] => 

సీబీఐ కస్టడీకి చిదంబరం 

[news_title_telugu] => సీబీఐ కస్టడీకి చిదంబరం  [news_title_english] => [news_short_description] => ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని ఈనెల 26 వరకు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. లోతైన దర్యాప్తు కోసం చిదంబరాన్ని అయిదు రోజుల కస్టడీకి [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/jUxuT5mWAkI [news_videoinfo] => |https://www.youtube.com/embed/jUxuT5mWAkI [news_sections] => ,27,26, ) )
సీబీఐ కస్టడీకి చిదంబరం  - EENADU
close
సీబీఐ కస్టడీకి చిదంబరం 

ప్రత్యేక న్యాయస్థానం ఆదేశం 
నాలుగు రోజుల విచారణకు అనుమతి 
ఈనాడు, దిల్లీ

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని ఈనెల 26 వరకు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. లోతైన దర్యాప్తు కోసం చిదంబరాన్ని అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయగా నాలుగురోజుల కస్టడీకి సమ్మతించింది. ఇక్కడి రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక జడ్జి అజయ్‌కుమార్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో 2007-08, 2008-09 మధ్య చిదంబరానికి చెల్లింపులు చేశారన్న ఆరోపణలు ‘నిర్దిష్టంగా’, ‘స్పష్టంగా’ ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఆ సొమ్ము చేతులు మారిన తీరును నిర్ధరించాల్సి ఉందని తెలిపింది. ఇందులో ఇమిడి ఉన్న సొమ్ము పరిమాణం, పాత్ర ఉన్న నిందితుల స్థాయి దృష్ట్యా లోతైన దర్యాప్తు అవసరమని పేర్కొంది.

చాలావరకూ ఇది లిఖితపూర్వక ఆధారాలకు సంబంధించిన కేసని, సదరు పత్రాలను వెలికి తీయాల్సి ఉందని తెలిపింది. ‘‘దర్యాప్తునకు తార్కిక ముగింపు ఇవ్వాల్సి ఉంది. అందుకోసం నిందితుడిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించడం కొన్నిసార్లు ఉపకరిస్తుంది. తనకు వ్యతిరేకంగా బలవంతపు చర్యలు తీసుకుంటారని నిందితుడు భయాందోళనలు వ్యక్తంచేశారు. దేశ పౌరుడిగా తన హక్కులను కాపాడుకునేందుకు ఆయన కోర్టును ఆశ్రయించవచ్చు’’ అని స్పష్టంచేసింది. ప్రతిరోజూ అరగంట పాటు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను కలవడానికి చిదంబరానికి కోర్టు అనుమతిచ్చింది. 48 గంటలకోసారి ఆయనకు వైద్యపరీక్షలు జరపాలంది. ఆయన మర్యాదకు భంగం కలిగించకూడదని స్పష్టంచేసింది. విచారణ సమయంలో చిదంబరం భార్య నళిని, ఆయన కుమారుడు కార్తిలు కూడా కోర్టులో ఉన్నారు.

చిదంబరాన్ని బుధవారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత నడుమ గురువారం సాయంత్రం 3.30 గంటలకు ఆయనను ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ హాజరుపరిచింది. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, చిదంబరం పక్షాన సీనియర్‌ న్యాయవాదులు, కాంగ్రెస్‌ నేతలు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్వీలు వాదనలు వినిపించారు. ఈ కేసులో 45 లక్షల నుంచి 50 లక్షల డాలర్ల మేర ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయని తుషార్‌ మెహతా పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో చిదంబరం పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని, కానీ ఆయన సమాధానాలు దాటవేస్తున్నారని, విచారణకు సహకరించడంలేదని చెప్పారు. ఆయనను రిమాండ్‌కు అప్పగిస్తే తప్ప ఈ భారీ ఆర్థికనేరాన్ని నిరూపించలేమన్నారు.

ఈ వాదనలను చిదంబరం తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఆరుగురు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శలు ఇచ్చిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) అనుమతులను అంగీకరించడానికే చిదంబరం పరిమితమైనట్లు పేర్కొన్నారు. ఆ అనుమతులిచ్చిన కార్యదర్శులెవ్వరినీ అరెస్టు చేయలేదని, పైగా అందులో ఒకరు రిజర్వు బ్యాంకు గవర్నర్‌ కూడా అయ్యారని చెప్పారు. పిలిచిన ప్రతిసారీ విచారణకు హాజరై, ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చిన చిదంబరాన్ని కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులైన కార్తీ చిదంబరం, భాస్కర్‌ రామన్‌ (కార్తికి చార్టెర్డ్‌ అకౌంటెంట్‌), పీటర్‌, ఇంద్రాణి ముఖర్జీ కూడా బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఇక్కడ కొత్తగా సేకరించే ఆధారాలేమీ లేవని, అంతకు మించిన కారణాలేవో ఉన్నట్లు అనిపిస్తోందని అన్నారు. తాజా విచారణలో సీబీఐ అధికారులు 12 ప్రశ్నలు అడిగారని, అందులో ఆరు ప్రశ్నలు పాతవేనని స్పష్టం చేశారు. అన్నింటికీ సమాధానమిచ్చినా.. దాటవేస్తున్నారని సీబీఐ చెబుతోందని, దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు ‘ఊ’ కొట్టనంత మాత్రాన తప్పించుకుంటున్నారనో, విచారణకు సహకరించడంలేదనో చెప్పడానికి వీల్లేదని అన్నారు. ఇంద్రాణి ముఖర్జీ ఇచ్చిన సాక్ష్యం, కేసు డైరీ మీద సీబీఐ ఆధారపడిందని, 2018లో ఇంద్రాణి వాంగ్మూలం నమోదుచేసిన 4నెలలకు చిదంబరాన్ని ప్రశ్నించారని, గత 11-12 నెలలుగా ఎలాంటి విచారణ జరపలేదని గుర్తు చేశారు. చిదంబరం అరెస్టుకు ప్రాతిపదిక సృష్టించడం కోసం సీబీఐ ఇప్పుడు ఇంద్రాణి అప్రూవర్‌గా మారినట్లు చెబుతోందన్నారు. 2018లో ఇచ్చిన పాత వాంగ్మూలం ఆధారంగానే ఆమె 2019లో అప్రూవర్‌గా మారారని చెప్పారు.

చిదంబరానికి మాట్లాడే అవకాశం ఇచ్చిన కోర్టు 

తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఒక దశలో చిదంబరం కోర్టును అభ్యర్థించారు. అందుకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభ్యంతరం తెలిపారు. ఆయన్ను అడగబోయే ప్రశ్నలు వెల్లడించబోమని స్పష్టం చేశారు. ఈ దశలో కోర్టు చిదంబరం విజ్ఞప్తిని మన్నించింది. దీంతో చిదంబరం మాట్లాడుతూ తాను ఇంతకుముందే సీబీఐ ప్రశ్నలన్నింటీకీ సమాధానం ఇచ్చానని చెప్పారు.

చిదంబరం: నాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి. 
తుషార్‌ మెహతా: దీనిపై మాకు అభ్యంతరం ఉంది. 
అభిషేక్‌ సింఘ్వీ: తన వాదన వినిపించుకునే అవకాశం నిందితుడికి ఇవ్వాలని ఇదివరకు దిల్లీ హైకోర్టు చెప్పింది. 
తుషార్‌: ఇక్కడ నిందితుడు ఏమీ తెలియని నిరక్షరాస్యుడు కాదు. విచారణకు సహకరించకుండా తప్పించుకుంటున్న తెలివైన వ్యక్తి. నిందితుడి విచారించడం మా విధి. ఏమేం ప్రశ్నలు అడగాలనుకుంటున్నదీ చెప్పబోం. మేం అడిగిన ప్రశ్నలన్నింటినీ రికార్డు చేస్తాం. మూలాలకు వెళ్లి శోధించకుంటే విధి నిర్వహణలో మేం విఫలం అవుతాం. 
(ఈ దశలో చిదంబరానికి తన వాదనను వినిపించుకునే అవకాశాన్ని కోర్టు కల్పించింది) 
చిదంబరం: 2018 జూన్‌ 6 నాటి విచారణ ప్రతిని చూడండి. వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇచ్చిన విషయం మీకు తెలుస్తుంది. 50లక్షల డాలర్లకు సంబంధించిన ఆరోపణను నావద్ద ప్రస్తావించలేదు. వాళ్లు కేవలం నాకు విదేశీ ఖాతా ఉందా? అని అడిగితే లేదని చెప్పాను. మీ కుమారుడికి ఉందా? అని అడిగితే.. ఉందని చెప్పాను.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.