Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179082
            [news_title_telugu_html] => 

పీఎం కిసాన్‌ సొమ్ము!

[news_title_telugu] => పీఎం కిసాన్‌ సొమ్ము! [news_title_english] => [news_short_description] => రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం కింద ఇస్తున్న మొత్తంలో కొంత సొమ్మును వారి కోసం ఉద్దేశించిన పింఛను పథకానికి ప్రీమియంగా మళ్లించుకోనుంది. ఇందుకోసం రైతులు బ్యాంకులో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
పీఎం కిసాన్‌ సొమ్ము! - EENADU
close
పీఎం కిసాన్‌ సొమ్ము!

రైతులు బ్యాంకులో ఆమోద పత్రం ఇస్తే చాలు
రాష్ట్ర వ్యవసాయశాఖను కోరిన కేంద్రం
పీఎం కిసాన్‌లో ఇచ్చేది ఏడాదికి రూ.6 వేలు
ప్రీమియం కింద పోయేది రూ.2400
రైతుకు నికరంగా అందేది రూ.3600
ఒకచేతితో ఇచ్చి.. రెండో చేతితో మళ్లించడమేనంటున్న రైతులు

ఈనాడు, హైదరాబాద్‌: రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం కింద ఇస్తున్న మొత్తంలో కొంత సొమ్మును వారి కోసం ఉద్దేశించిన పింఛను పథకానికి ప్రీమియంగా మళ్లించుకోనుంది. ఇందుకోసం రైతులు బ్యాంకులో అంగీకార పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం తాజాగా రాష్ట్ర వ్యవసాయశాఖకు తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకం కింద ఇస్తున్న సాయాన్ని ‘ప్రధానమంత్రి కిసాన్‌ మన్‌-ధన్‌ యోజన’ (పీఎం కేఎంవై)కు మళ్లించుకుంటామని.. పీఎంకిసాన్‌లో లబ్ధి పొందిన రైతులందరినీ పీఎంకేఎంవైలో చేరేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయశాఖకు సూచించింది. ఇది ఒక చేతితో ఒక పథకంలో ఆర్థిక సాయం చేస్తూ మరో పథకానికి ఇంకో చేతితో సొమ్మును మళ్లించుకోవడమేనని రైతులు అభిప్రాయపడుతున్నారు.

స్థోమత లేనివారే అధికం
దేశంలోని మొత్తం అన్నదాతల్లో 80శాతం మంది సన్న, చిన్నకారు రైతులకు ఐదెకరాల్లోపు భూమి ఉంది. వీరికి ఆదాయం సరిగా లేక జీవిత చరమాంకంలో సామాజిక భద్రత ఉండటంలేదు. ఈ నేపథ్యంలో వీరికి ఆ సమయంలో సాయపడేందుకు కేంద్ర వ్యవసాయశాఖ ఈ నెల ఒకటి నుంచి పీఎంకేఎంవైని అమలులోకి తెచ్చింది. ఐదెకరాల్లోపు ఉన్న రైతుకు 60ఏళ్లు నిండినప్పటి నుంచి నెలకు రూ.3వేల పింఛను ఇవ్వాలనేది దీని ప్రధానోద్దేశం. ఇందుకు 18-40 ఏళ్లలోపున్న రైతులు నెలకు వారి వయసును బట్టి రూ.55నుంచి 200దాకా ప్రీమియం చెల్లించాలి. రైతులు సొంతంగా ప్రీమియం కట్టడానికి చాలారాష్ట్రాల్లో ముందుకు రావడంలేదు. అత్యధికశాతం రైతులు నెలనెలా ప్రీమియం కట్టగల ఆర్థిక స్థోమత లేనివారే కావడం ఇందుకు ప్రధానకారణం.

తెలంగాణలో 36 లక్షల మంది
తెలంగాణలో పీఎం కిసాన్‌ పథకం కింద 36లక్షల మంది రైతుల పేర్లు, బ్యాంకు ఖాతాల వివరాలను ఆన్‌లైన్‌లో వ్యవసాయశాఖ నమోదు చేసింది. వీరిలో 31.97లక్షల మంది ఖాతాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జులై నెలాఖరు వరకు రూ.640కోట్లను కేంద్ర వ్యవసాయశాఖ జమచేసింది. ఒక్కో రైతు ఖాతాలో రూ.2వేల చొప్పున వేసింది. మిగిలిన 4లక్షల మంది ఖాతాల్లో ఈ నెలలో వేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖకు తెలిపింది. పీఎం కిసాన్‌ కింద ప్రతీ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున 3 విడతలుగా ఏడాదికి మొత్తం రూ.6వేలు రైతు ఖాతాలో కేంద్రం జమచేస్తుంది. ఈ రూ.6వేల నుంచి పీఎంకేఎంవై పథకానికి రైతు కట్టాల్సిన ప్రీమియం కింద రూ.2400 తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఇవిపోగా నికరంగా రైతుకు రూ.3600లే పీఎంకిసాన్‌లో అందుతాయి.
పీఎంకిసాన్‌ సొమ్ము జమ అయిన ఖాతా నుంచి పీఎంకేఎంవైకి తన ప్రీమియం తీసుకోవడానికి రైతు అంగీకరిస్తూ సంతకం చేసి పత్రమిస్తే.. ఆటోడెబిట్‌ ద్వారా ఏటా ప్రీమియం వెళ్లేలా బ్యాంకు సిబ్బంది చూస్తారు. రైతు భార్య కూడా పీఎంకేఎంవైలో విడిగా నెలనెలా ప్రీమియం కట్టి చేరవచ్చు. వారి సొమ్మునూ పీఎంకిసాన్‌లో నుంచి తీసుకోమని కోరవచ్చు. ప్రీమియం కట్టడం మొదలైన తరవాత రైతు కన్నుమూస్తే అప్పటివరకు కట్టిన ప్రీమియం సొమ్మును వడ్డీతో సహా నామినీకి చెల్లిస్తారు. దీనిపై పీఎంకిసాన్‌ లబ్ధిదారులైన రైతుల్లో అవగాహన కల్పించాలని కేంద్ర వ్యవసాయశాఖ సూచించినట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా ‘ఈనాడు’కు చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.