Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179124
            [news_title_telugu_html] => 

జైట్లీ మృతిపై ప్రముఖుల సంతాపం

[news_title_telugu] => జైట్లీ మృతిపై ప్రముఖుల సంతాపం [news_title_english] => [news_short_description] => మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. జైట్లీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
జైట్లీ మృతిపై ప్రముఖుల సంతాపం - EENADU
close
జైట్లీ మృతిపై ప్రముఖుల సంతాపం

దిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. జైట్లీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

‘‘అరుణ్‌జైట్లీ మరణం దేశ ప్రజలకు తీరని లోటు. ఎంతో కష్టమైన బాధ్యతలను కూడా సునాయాసంగా, విజయవంతంగా నిర్వహించేవారు. చేపట్టే ప్రతి పనిని ఎంతో నిష్టతో పూర్తి చేసే విశేష లక్షణాలున్న వ్యక్తి. దేశ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు.’’

- రామ్‌నాథ్‌ కోవింద్‌, భారత రాష్ట్రపతి

 

‘‘జైట్లీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం దేశానికి కోలుకోలేని నష్టం. అత్యంత అత్మీయుడైన సహచరుడిని, మిత్రుడిని కోల్పోయాను. న్యాయకోవిదుడు, పరిపాలనాదక్షుడు. కేంద్ర మంత్రిగా కీలకమైన శాఖలను సమర్థంగా నిర్వహించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. విప్లవాత్మకమైన జీఎస్‌టీ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు విపక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు ఎంతో కష్టపడ్డారు.

- ఎం.వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి

 

‘‘ముఖ్య నేతను కోల్పోయాం. విశేషమైన అనుభవం, సామర్ధ్యాలతో పేదల సంక్షేమం కోసం ప్రధాని మోదీ దార్శనికతను కార్యాచరణలో పెట్టడంలో జైట్లీ తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం వ్యక్తిగతంగా ఎంతో నష్టం. కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా ఉంది. ఆయన చాలా కాలంగా నాకు మద్దతు ఇస్తూ మార్గదర్శనం చేస్తున్నారు.’’

- అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు

 

‘‘అనేక ముఖ్య సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు పార్టీ జైట్లీ పై ఆధారపడేది. నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జైట్లీని పార్టీ వ్యూహ బృందంలోకి తీసుకున్నాం. ఆయన అతి తక్కువ సమయంలోనే  అతి ముఖ్యమైన నాయకుడిగా ఎదిగారు. మృదుభాషి, భోజన ప్రియుడు. అనేక రెస్టారెంట్లలో దొరికే ఆహారం గురించి నాకు సిఫార్సు చేసేవారు. ఒక దీపావళి నాడు ఆయన తన కుటుంబంతో కలసి మా ఇంటికి భోజనానికి వచ్చారు. కోలుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తారని ఆశించాం’’

- ఆడ్వాణీ, భాజపా అగ్రనేత

 

జైట్లీ మరణం ఆవేదనకు గురి చేసింది. సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్‌గా, మంత్రిగా ప్రజలకు సేవ చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయం.

- సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు

 

గొప్పవక్త, న్యాయవాది, సమర్థ పాలనాదక్షుడు, ఉత్తమ పార్లమెంటేరియన్‌ను దేశం కోల్పోయింది.

- మన్మోహన్‌ సింగ్‌, మాజీ ప్రధాని

 

‘‘దేశం ఒక గొప్ప న్యాయవాదిని, నాయకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’

- జస్టిస్‌ రంజన్‌ గొగొయి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

 

‘‘జైట్లీచాలా చిన్న వయస్సులోనే రాజకీయ, సామాజిక జీవనం ప్రారంభించారు. వివిధ రంగాల్లో దేశం అభివృద్ధి చెందేందుకు బాటలు వేయడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది.’’

- మోహన్‌ భగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.