Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179125
            [news_title_telugu_html] => 

నిర్లక్ష్యంతోనే చంపేస్తున్నారు

[news_title_telugu] => నిర్లక్ష్యంతోనే చంపేస్తున్నారు [news_title_english] => [news_short_description] => సామర్థ్యానికి మించి అధికలోడుతో వెళ్తున్న వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, దీనివల్ల అమాయక ప్రాణాలు బలవుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలపై జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/pkTz5nsPIis [news_videoinfo] => |https://www.youtube.com/embed/pkTz5nsPIis [news_sections] => ,27,26, ) )
నిర్లక్ష్యంతోనే చంపేస్తున్నారు - EENADU
close
నిర్లక్ష్యంతోనే చంపేస్తున్నారు

అధిక లోడు వాహనాలతో రోడ్డు ప్రమాదాలు
చట్టాలను కఠినంగా అమలు చేయకుంటే మరిన్ని ప్రమాదాలు
ఘాటుగా స్పందించిన హైకోర్టు
సీజ్‌ అయిన వాహనాల విదుదలకు మార్గదర్శకాల జారీ
ఈనాడు - హైదరాబాద్‌

సామర్థ్యానికి మించి అధికలోడుతో వెళ్తున్న వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, దీనివల్ల అమాయక ప్రాణాలు బలవుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలపై జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ తీర్పు వెలువరించి 30 ఏళ్లు దాటినా పరిస్థితి మెరుగుపడలేదంది. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. రహదారి భద్రతకు చెందిన రెండు చట్టాలను కఠినంగా అమలు చేయని పక్షంలో మరిన్ని అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వ్యాఖ్యానించింది. ఈ నెల 4న ఆటో ప్రమాదంలో 13 మంది అమాయక వ్యవసాయ కూలీలు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారని, ఆరుగురి కోసం రూపొందించిన వాహనంలో ఇంతమందిని ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందంది. ఇలా ప్రయాణించే వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు కఠిన శిక్షలు విధిస్తే వాహన యజమానుల్లో భయం ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది. అధిక లోడుతో వెళుతున్న వాహనాలను సీజ్‌ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారించిన జస్టిస్‌ పి.నవీన్‌రావు వాటిని పరిష్కరిస్తూ ఇటీవల తీర్పు వెలువరించారు. ప్రత్యామ్నాయం ఉండగా నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు.

ఇవీ మార్గదర్శకాలు
* ఎక్కువ లోడుతో వెళుతున్న వాహనాలను సీజ్‌ చేసినపుడు నేరుగా హైకోర్టులో పిటిషన్‌ విచారణార్హం కాదు. యజమాని, డ్రైవర్‌ ఎవరైనా ఇక్కడ పిటిషన్‌ వేయడానికి ముందే చట్టప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలి.
* రాష్ట్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం సీజ్‌ చేసిన వాహన యజమాని ఆర్‌టీఏ కార్యదర్శి వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై కార్యదర్శి చట్టప్రకారం పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలి. తగిన షరతులు విధించి వాహనాన్ని విడుదల చేయవచ్చు.
* వాహనాన్ని సీజ్‌ చేసే ప్రక్రియను వీడియోతో చిత్రీకరించి దాన్ని రికార్డులో భాగం చేయాలి. వీడియో రికార్డింగ్‌ విధానాన్ని రూపొందించాలి.
* కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే పరిష్కారంలో ఎక్కువ జాప్యం జరుగుతోందన్నది యజమానుల ఆవేదన. దీనికి పరిష్కారంగా ఆన్‌లైన్‌ వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్నదానిలో ప్రత్యేకంగా పేజీ, ప్రత్యేంగా మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందించి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తును పరిష్కరించాలి. విచారణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టాలి. ఇలాంటి దరఖాస్తును వారంలోగా పరిష్కరించాలి.
* మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇప్పటికే విడుదలైన వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఈ కోర్టు చెప్పడం లేదు. అయితే ప్రాసిక్యూషన్‌ చేయడానికి, జరిమానా విధించడానికీ ఈ ఉత్తర్వులు అడ్డంకి కావు. ఒకవేళ యజమాని అడ్వాన్స్‌గా సొమ్ము చెల్లించినట్లయితే తప్పుతేలి విధించే జరిమానాతో సర్దుబాటు చేయాలి. యజమాని జరిమానా చెల్లించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. చట్టప్రకారం ప్రాసిక్యూట్‌ చేయడానికి అధికారులకు అవకాశం ఉంది.
* జరిమానా చెల్లించడానికి వాహన యజమాని చేసుకున్న దరఖాస్తును అనుమతించినట్లయితే వాహనాన్ని విడుదల చేసే ముందు దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి.
* అక్రమాలకు పాల్పడుతున్న ఇసుక లారీలను స్వాధీనం చేసుకునే విషయంలో మైనింగ్‌ అధికారులు కూడా రవాణాశాఖతో అనుసంధానమై తగిన నిర్ణయాలు తీసుకోవాలి.
* ప్రభుత్వం, రవాణాశాఖ కమిషనర్లు సాంకేతిక రంగాన్ని వినియోగించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. పోలీసు, పరిశ్రమల శాఖల అధికారులకు అవకాశం ఉండేలా  ప్రయాణికులు, సరకు రవాణా వాహనాలు నిబంధనల ఉల్లంఘనలు ఆన్‌లైన్‌లో కనిపించేలా ఉండాలి. యజమాని/డ్రైవర్‌ పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తే ఆవివరాలు ఆన్‌లైన్‌లో కనిపించాలి, తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
* తప్పులకు పాల్పడ్డ యజమాని/డ్రైవర్‌ను ప్రాసిక్యూట్‌ చేయడానికి గడువును నిర్దేశించాలి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మూడు నెలల్లో రూపొందించాలి.

చట్టాల అమల్లో ఉదాసీనత
అధికలోడుతోపాటు సామర్థ్యంలేని వాహనాలను నియంత్రించడానికి చట్టాల్లో నిబంధనలున్నప్పటికీ అమలులో ఉదాసీనత కనిపిస్తోందని జస్టిస్‌ పి.నవీన్‌రావు వ్యాఖ్యానించారు. కఠినమైన శిక్షలు లేనిపక్షంలో అమాయకుల ప్రాణాలకు రక్షణ కల్పించడం సాధ్యం కాదన్నారు. వాహనాన్ని వినియోగించుకునే హక్కు వ్యక్తులకు ఉందని, అయితే ఇది విస్తృత ప్రజాప్రయోజనాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీజ్‌ చేసిన వాహనాల విడుదల విషయంలో దాఖలైన దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. వాహనాల సీజ్‌, వాటి విడుదలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.