Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179135
            [news_title_telugu_html] => 

శ్రీనగర్‌ నుంచి రాహుల్‌ వెనక్కి

[news_title_telugu] => శ్రీనగర్‌ నుంచి రాహుల్‌ వెనక్కి [news_title_english] => [news_short_description] => కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ సారథ్యంలో శ్రీనగర్‌ చేరుకున్న ప్రతిపక్ష ప్రతినిధి బృందాన్ని అధికారులు శనివారం విమానాశ్రయంలోనే అడ్డుకుని వెనక్కి తిప్పి పంపించారు. 370 అధికరణం రద్దు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/dCZcWSicAfU [news_videoinfo] => |https://www.youtube.com/embed/dCZcWSicAfU [news_sections] => ,27,26, ) )
శ్రీనగర్‌ నుంచి రాహుల్‌ వెనక్కి - EENADU
close
శ్రీనగర్‌ నుంచి రాహుల్‌ వెనక్కి

ప్రతిపక్ష నేతలను తిప్పిపంపిన అధికారులు

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ సారథ్యంలో శ్రీనగర్‌ చేరుకున్న ప్రతిపక్ష ప్రతినిధి బృందాన్ని అధికారులు శనివారం విమానాశ్రయంలోనే అడ్డుకుని వెనక్కి తిప్పి పంపించారు. 370 అధికరణం రద్దు అనంతరం కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపక్ష నేతల బృందాన్ని వెనక్కి పంపివేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్‌ వెళ్లిన 12 మందితో కూడిన ప్రతిపక్ష బృందంలో రాహుల్‌తోపాటు, గులాంనబీ ఆజాద్‌(కాంగ్రెస్‌), శరద్‌పవార్‌(ఎన్సీపీ), వామపక్ష నేతలు డి.రాజా, సీతారాం ఏచూరి తదితరులున్నారు. ప్రతిపక్ష ప్రతినిధి బృందాన్ని  వెనక్కి తిప్పిపంపకుండా అనుమతించి ఉండాల్సిందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ అభిప్రాయపడ్డారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లాను కొందరు కేంద్రప్రభుత్వ అధికారులు కలుసుకున్నారంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ ఖండించింది.  జమ్మూ-కశ్మీర్‌లోవాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి భద్రతాదళాలు హై అలర్ట్‌లో ఉన్నట్లు అధికారులు శనివారం తెలిపారు. కశ్మీరు లోయలో విధించి ఉన్న ఆంక్షలను పలుప్రాంతాల్లో శనివారం సడలించారు.
శుక్రవారం ప్రార్థనలు, వేర్పాటువాదులు పాదయాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలో లోయలో ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. శుక్రవారం పరిస్థితి ప్రశాంతంగా కొనసాగడంతో కొన్నిచోట్ల ఆంక్షలను సడలించారు. కొన్ని ప్రాంతాల్లో టెలిఫోన్‌ల్యాండ్‌లైన్‌ సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.

జమ్మూ-కశ్మీర్‌లో పరిస్థితి అంత మామూలుగా ఏమీ లేదని ఇప్పుడు స్పష్టమైపోయిందని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. శ్రీనగర్‌ విమానాశ్రయం నుంచి వెనుదిరిగిన ఆయన దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కొన్నిరోజుల క్రితం గవర్నర్‌ తనను జమ్మూ-కశ్మీర్‌ పర్యటనకు ఆహ్వానించారనీ...ఆయన మాట మన్నించి వెళితే విమానాశ్రయం పరిధి దాటి వెళ్లడానికి తమను అనుమతించనే లేదని రాహుల్‌ అన్నారు. దీన్నిబట్టి చూస్తే అక్కడ పరిస్థితి సరిగ్గా లేదని సుస్పష్టమైపోతోందన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.