Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179138
            [news_title_telugu_html] => 

ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ కల సాకారం

[news_title_telugu] => ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ కల సాకారం [news_title_english] => [news_short_description] => ఐపీఎస్‌ సాధనతో మీ లక్ష్యం పూర్తికాలేదు. అసలైన లక్ష్యం, బాధ్యత ఇప్పుడే మొదలయ్యాయి. సుశిక్షిత, సురక్షిత, సమృద్ధ భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దాలి. ఐపీఎస్‌ అధికారిగా మీరు దేశ పటిష్ఠతకు, ప్రజల [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/8SSFETk6X2k [news_videoinfo] => |https://www.youtube.com/embed/8SSFETk6X2k [news_sections] => ,27,26, ) )
ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ కల సాకారం - EENADU
close
ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ కల సాకారం

ఐపీఎస్‌ అధికారులు రాజ్యాంగ మూలాల్ని మరవొద్దు
పేదరికాన్ని తొలగించి, దేశాన్ని అవినీతి రహితంగా మార్చాలి
ఐపీఎస్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో అమిత్‌షా

ఐపీఎస్‌ సాధనతో మీ లక్ష్యం పూర్తికాలేదు. అసలైన లక్ష్యం, బాధ్యత ఇప్పుడే మొదలయ్యాయి. సుశిక్షిత, సురక్షిత, సమృద్ధ భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దాలి. ఐపీఎస్‌ అధికారిగా మీరు దేశ పటిష్ఠతకు, ప్రజల పేదరికాన్ని దూరం చేసేందుకు అంకితం కావాలి. దేశాన్ని గౌరవప్రదమైన స్థానంలోకి తీసుకెళ్లాలి. ఈ లక్ష్య సాధనలో కఠోర సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా చేసిన ప్రతిజ్ఞ గుర్తుకు తెచ్చుకోవాలి.

- కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

 

ఈనాడు - హైదరాబాద్‌

ఒక చారిత్రక పోలీసు చర్య తరువాత హైదరాబాద్‌ భారత్‌లో విలీనమైంది. స్వాతంత్య్రం తరువాత పటేల్‌ ఆధ్వర్యంలో వందలాది సంస్థానాలు విలీనమయ్యాయి. ఇక్కడి నిజాం భారత దేశంలో కలిసేందుకు ఒప్పుకోలేదు. వల్లభ్‌భాయ్‌పటేల్‌ నేతృత్వంలో జరిగిన పోలీసు చర్యతో తెలంగాణ, హైదరాబాద్‌, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలు దేశంలో విలీనమయ్యాయి. ఈ ఘనత అంతా పోలీసు చర్యకు వెళ్తుంది

- అమిత్‌షా

 

జమ్మూ-కశ్మీర్‌ దేశంలో అంతర్భాగమైనప్పటికీ ఆర్టికల్‌ 370 రూపంలో వెలితి ఉండేదని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంకల్ప చర్యతో సమైక్య భారత్‌ సంపూర్ణమైందని హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. స్వాతంత్య్రం తరువాత వందలాది సంస్థానాల్ని ఉక్కుమనిషి సర్దార్‌ పటేల్‌ విలీనం చేశారని, ఆర్టికల్‌ 370 రద్దుతో ఆయన కల నెరవేరిందని పేర్కొన్నారు. దేశభద్రత, రక్షణ పోలీసుల చేతుల్లో ఉందని, రాజ్యాంగ పీఠికకు లోబడి రాజ్యాంగాన్ని కాపాడాలని, అసాంఘిక శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని సూచించారు. ఐపీఎస్‌లుగా ఎంపిక కావడంతో జీవిత లక్ష్యం నెరవేరినట్టు కాదని, అవినీతి రహితంగా తీర్చిదిద్ది, బాహ్య అంతర్గత శక్తులను ఎదుర్కొని భద్రత కల్పించాల్సిన లక్ష్యం ఇప్పుడే మొదలైందన్నారు. దేశరక్షణతో అభివృద్ధి జరుగుతుందని, ఆర్థికవ్యవస్థను ఐదు ట్రిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లడం సాధ్యమవుతుందని తెలిపారు. శనివారమిక్కడ సర్దార్‌ వల్లభ్‌భాయ్‌పటేల్‌ పోలీసు అకాడమీలో 70వ బ్యాచ్‌ ప్రొబెషనరీ ఐపీఎస్‌ అధికారుల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో (దీక్షాంత్‌పరేడ్‌) పాల్గొన్నారు. అకాడమీ డైరెక్టర్‌ అభయ్‌, పరేడ్‌ కమాండర్‌ గౌష్‌ ఆలం ఆధ్వర్యంలో ట్రైనీ ఐపీఎస్‌ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ బ్యాచ్‌లో 103 మంది ఉండగా వారిలో 92 మంది ఐపీఎస్‌లు. అందులో 12 మంది మహిళా అధికారులు. నేపాల్‌ పోలీసు సర్వీసు నుంచి ఐదుగురు, రాయల్‌ భూటాన్‌ పోలీసు సర్వీసు నుంచి ఆరుగురు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 15 మంది మహిళా అధికారులు ఉన్నందున హోం మంత్రి అమిత్‌ షా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.

‘‘కష్టపడి పనిచేస్తే గుర్తింపుతో పాటు ఆత్మసంతృప్తి లభిస్తుంది. తీవ్రవాదం, నార్కొటిక్‌, సైబర్‌క్రైమ్‌, పొరుగుదేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు మోదీ సూచించిన స్మార్ట్‌ పోలీసు లక్ష్యంతో పనిచేయాలి. పోలీసు బలగాలకు నేతృత్వం వహించేప్పుడు దేశరక్షణ కోసం ప్రాణాలను బలిదానం చేసిన 33 వేల మంది పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తుతెచ్చుకుని, వారు చూపిన మార్గంలో వెళ్లాలి.’’ అని అమిత్‌షా సూచించారు.. ఈ కార్యక్రమంలో అకాడమీ అదనపు డైరెక్టర్‌ ఉమేష్‌ షరాఫ్‌, తెలంగాణ గవర్నర్‌  నరసింహన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, అకాడమీ పూర్వ అధికారులు, 71వ బ్యాచ్‌ ప్రొబేషనరీ ట్రైనీ ఐపీఎస్‌లు పాల్గొన్నారు. పరేడ్‌ కమాండర్‌గా వ్యహరించిన ప్రొబేషనరీ ఐపీఎస్‌ గౌష్‌ ఆలం (తెలంగాణ కేడర్‌) ఆరు రంగాల్లో ప్రతిభచూపి అవార్డులు పొందారు. మహిళా విభాగంలో రిచా తోమర్‌ (రాజస్థాన్‌) టాపర్‌గా నిలిచారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.