Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179604
            [news_title_telugu_html] => 

అరుణ్‌ జైట్లీకి కన్నీటి వీడ్కోలు

[news_title_telugu] => అరుణ్‌ జైట్లీకి కన్నీటి వీడ్కోలు [news_title_english] => [news_short_description] => కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు వేల మంది అభిమానుల అశ్రునయనాల మధ్య దిల్లీలోని యమునా నది తీరంలో ఉన్న నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆదివారం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. భాజపా కార్యకర్తలు, [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/0oZvb-1opvs [news_videoinfo] => |https://www.youtube.com/embed/0oZvb-1opvs [news_sections] => ,27,26, ) )
అరుణ్‌ జైట్లీకి కన్నీటి వీడ్కోలు - EENADU
close
అరుణ్‌ జైట్లీకి కన్నీటి వీడ్కోలు

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
వేలాదిగా తరలివచ్చిన అభిమానులు

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు వేల మంది అభిమానుల అశ్రునయనాల మధ్య దిల్లీలోని యమునా నది తీరంలో ఉన్న నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆదివారం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. భాజపా కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు, అభిమానులు తరలివచ్చి తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. జైట్లీ కుమారుడు రోహన్‌ తండ్రి చితికి నిప్పంటించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఇక్కడి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మరణించిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, భాజపా సీనియర్‌ నేత ఆడ్వాణీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భాజపా కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, అనురాగ్‌ ఠాకుర్‌, కాంగ్రెస్‌ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, కపిల్‌ సిబల్‌ తదితరులు నిగమ్‌బోధ్‌ ఘాట్‌కు వచ్చి జైట్లీకి నివాళులు అర్పించారు. దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, బిహార్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, దేవేంద్ర ఫడణవీస్‌, విజయ్‌ రూపాణి, బీఎస్‌ యడియూరప్ప, నీతీశ్‌కుమార్‌, త్రివేంద్రసింగ్‌ రావత్‌లు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు పార్టీ శ్రేణుల చివరి చూపు కోసం అరుణ్‌జైట్లీ పార్థివదేహాన్ని భాజపా కేంద్ర కార్యాలయంలో ఉంచారు. అక్కడి నుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు అంతిమయాత్ర సాగింది. దారిపొడవునా అభిమానులు అరుణ్‌జైట్లీ ‘అమర్‌ రహే’ అంటూ నినాదాలు చేశారు. భాజపాలో జైట్లీతో కలిసి పనిచేసిన వెంకయ్యనాయుడు అప్పటి సంగతులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో పార్థివదేహానికి నమస్కరిస్తూ కొద్ది నిమిషాలు నిశ్చల స్థితిలో ఉండిపోయారు. అంత్యక్రియల సమయంలో భారీ వర్షం కురిసినప్పటికీ.. అక్కడకు వచ్చిన జైట్లీ అభిమానులు ఏమాత్రం చలించలేదు.

ఆయన ముద్ర చెరగనిది: రాహుల్‌
పార్లమెంటు వ్యవహారాల్లో అరుణ్‌జైట్లీ గొంతు వినిపించకపోవచ్చు, ఆయన వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన జైట్లీ కుటుంబసభ్యులకు సంతాప సందేశం పంపారు.

ఖరీదైన బ్రాండ్లంటే మక్కువ
రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచే ఖరీదైన బ్రాండ్ల వస్తువులంటే అరుణ్‌ జైట్లీకి మక్కువ. లండన్‌కు చెందిన బిస్పోక్‌ చొక్కా, జాన్‌ లాబ్‌కు చెందిన చేతితో తయారు చేసిన బూట్లు, పాటిక్‌ ఫిలిప్‌ చేతి గడియారాలు, మోంట్‌ బ్లాంక్‌ పెన్నులు వంటివి ఆయన వాడేవారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.