Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179669
            [news_title_telugu_html] => 

పౌష్టిక సుదృఢభారత్‌

[news_title_telugu] => పౌష్టిక సుదృఢభారత్‌ [news_title_english] => [news_short_description] => ఆరోగ్యకరమైన భారత్‌ కోసం మూడు నూతన ప్రజా ఉద్యమాలు చేపట్టనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దృఢమైన ప్రజానీకం ఉండేలా చూసేందుకు ‘ఫిట్‌ ఇండియా ఉద్యమం’, పసిపిల్లల కోసం ‘పౌష్టికాహార ఉద్యమం’, [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
పౌష్టిక సుదృఢభారత్‌ - EENADU
close
పౌష్టిక సుదృఢభారత్‌

ప్రజా ఉద్యమంగా ఫిట్‌ ఇండియా
పసి పిల్లల కోసం పోషణ్‌ అభియాన్‌
ప్రధాని మోదీ వెల్లడి
ప్లాస్టిక్‌ వ్యర్థాలపై పోరడదామని జాతికి పిలుపు

దిల్లీ: ఆరోగ్యకరమైన భారత్‌ కోసం మూడు నూతన ప్రజా ఉద్యమాలు చేపట్టనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దృఢమైన ప్రజానీకం ఉండేలా చూసేందుకు ‘ఫిట్‌ ఇండియా ఉద్యమం’, పసిపిల్లల కోసం ‘పౌష్టికాహార ఉద్యమం’, పర్యావరణ పరిరక్షణ కోసం ‘ప్లాస్టిక్‌ వ్యర్థాల వ్యతిరేక ఉద్యమం’ నిర్వహించనున్నట్టు తెలిపారు. తొలి ఉద్యమమైన ‘ఫిట్‌ ఇండియా’ను ఈ నెల 29న ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఈ ఉద్యమాల విషయాన్ని ప్రస్తావించారు. వరుసగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే ఈ ఉద్యమాల్లో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. 1942 ఆగస్టులోనే ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం కూడా జరగడం గమనార్హం.

అన్ని వర్గాలకు ఆసక్తికరంగా
‘‘ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం. అదే రోజున ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. ఆ రోజునే ఈ పథకం పూర్తి వివరాలను వెల్లడిస్తా. మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు అందరి కోసం ఆసక్తికరంగా ఉండే కార్యక్రమాలు ఇందులో ఉంటాయి.

మహిళలు, నవజాత శిశువులే భావి తరాలకు పునాదులు. వీరికి ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో పౌష్టికాహారం అందించాల్సి ఉంది. ఇందుకోసం పోషణ్‌ అభియాన్‌ పేరుతో ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. ఈ విషయమై ఇప్పటికే కొన్ని చోట్ల వినూత్న కార్యక్రమాలు సాగుతున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌లో ‘ముట్టీ భర్‌ ధాన్య’ పేరుతో అంగన్వాడీ కార్యకర్తలే ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పంటలు చేతికందే సమయంలో అందరి ఇళ్లకీ వెళ్లి పిడికెడు ధాన్యాన్ని సేకరిస్తున్నారు. దాన్ని ఆహారంగా మార్చి పిల్లలకు పెడుతున్నారు. ఈ ‘అన్నప్రాసన సంస్కార్‌’లో అందరూ భాగస్వాములవుతున్నారు. పలువురు వ్యక్తులు తమకు ఇష్టమైన తేదీల్లో పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం చాలా ప్రాంతాల్లో అమలవుతోంది. సెప్టెంబరు నెలను దేశమంతటా ‘పోషణ్‌ అభియాన్‌’ మాసంగా జరుపుకొని అలాంటి విధానాలు అమలు చేద్దాం.

ప్రకృతిని ఆస్వాదించండి
దేశంలో పులుల సంఖ్య పెరగడం సంతోషకరం. పర్యావరణ పరిరక్షణ అంటే వన్య ప్రాణుల సంతతి పెరిగేలా చూడడం కూడా. అడవుల వల్ల పులులకు, పులుల వల్ల అడవులకు రక్షణ ఉంటుందని మన పురాణాలు ఎప్పుడో చెప్పాయి. వన్యప్రాణులు ఉన్న ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలుగానూ అభివృద్ధి చెందుతున్నాయి. దేశంలో పలుచోట్ల, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లండి. కుటుంబాలతో వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అక్కడికి వెళ్తే మీరు నూతన ఉత్సాహంతో తిరిగి వస్తారు. నన్ను నమ్మండి.’’


ప్లాస్టిక్‌ వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెద్దాం

సెప్టెంబరు 11వ తేదీన ‘స్వచ్ఛతా హీ సేవ’ (స్వచ్ఛతే సేవ) అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అనంతరం అక్టోబరు 2న మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ప్లాస్టిక్‌పై పోరాటానికి శ్రీకారం చుడదాం. ఆ రోజును ‘ప్లాస్టిక్‌ రహిత భారత మాత’ కార్యక్రమంగా పాటించాలి. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి వాటిని ఏ విధంగా పునర్వినియోగంలోకి తీసుకురావాలి అన్న విషయమై కార్పొరేట్‌ సంస్థలు జరిగే దీపావళి (అక్టోబరు 27)లోగా నిర్ణయం తీసుకోవాలి. సామాజిక సేవ చేయడం ద్వారా మహాత్మునికి కార్యాంజలి ఘటించాలి. ఆ రోజును శ్రమదాన ఉత్సవంగా జరుపుకోవాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.