Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179672
            [news_title_telugu_html] => 

పౌర సేవలకు జనతా జనార్దన్‌!

[news_title_telugu] => పౌర సేవలకు జనతా జనార్దన్‌! [news_title_english] => [news_short_description] => అరచేతిలో ప్రభుత్వ సేవలు, సమాచారం అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది.. ఎంతో సౌకర్యంగా ఉంటుంది కదా.. సరిగ్గా అలాంటి ప్రయోగమే చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/CzdsGQ6c8Ro [news_videoinfo] => |https://www.youtube.com/embed/CzdsGQ6c8Ro [news_sections] => ,27,26, ) )
పౌర సేవలకు జనతా జనార్దన్‌! - EENADU
close
పౌర సేవలకు జనతా జనార్దన్‌!

మొబైల్‌ యాప్‌ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం
సీఎం కేసీఆర్‌ పరిశీలన అనంతరం విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: అరచేతిలో ప్రభుత్వ సేవలు, సమాచారం అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది.. ఎంతో సౌకర్యంగా ఉంటుంది కదా.. సరిగ్గా అలాంటి ప్రయోగమే చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి.. ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా సమస్త ప్రభుత్వ సేవలు, అందుబాటులోకి తెచ్చేందుకు, వారి అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తోంది.. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పంథాలో తయారుచేసి.. ప్రజలకు అందుబాటులోకి తేబోతున్న ఈ మొబైల్‌ యాప్‌ పేరు ఏమిటో తెలుసా.. జనతా జనార్దన్‌.. ప్రజలే ప్రభువులుగా భావించి, వారికి సేవలందించేందుకు ఉద్దేశించిన యాప్‌ కాబట్టి.. ఈ పేరు ఖరారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన యంత్రాంగంతో పాటు సమస్త తెలంగాణ ప్రజలకు జనతా జనార్దన్‌ ఉపయుక్తం కానుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రస్తుతమున్న వివిధ వెబ్‌సైట్లు, పోర్టళ్లతో అనుసంధానం కానుంది. కేంద్రం ఆమోదిస్తే కేంద్ర వెబ్‌సైట్లకు సైతం అనుసంధానం చేయాలని భావిస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వ సేవలకు ఏకీకృత వ్యవస్థ లేదు. వివిధ మార్గాల ద్వారా వీటిని అందిస్తున్నారు. సమాచార వ్యవస్థకు వేర్వేరు పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రస్తుతం మొబైల్‌ యాప్‌లు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. దీనిద్వారా పాలనను సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏడాదిన్నరగా కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి దీన్ని రూపకల్పన చేశారు.

ఉపయోగం
* అన్ని రకాల సమాచారాన్ని(డేటా బేస్‌) ఇందులో పొందుపరుస్తారు. ఒక వ్యక్తి, అతని కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలను అందులో పొందుపరిచే వెసులుబాటు కల్పిస్తుంది.
* ఇందులో ప్రతి వ్యక్తికీ ఒక యునిక్‌ ఐడెంటిటీ కోడ్‌ను ఇచ్చి యాప్‌లోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు. తన వివరాలను తానే అందులో పొందుపరచవచ్చు. ఒకరి వివరాలు మరొకరు చూడకుండా రక్షణ కల్పించనున్నారు.
* ప్రభుత్వ శాఖలకు, ఉద్యోగులకు, అధికారులు ఈ యాప్‌లో భాగస్వాములుగా ఉంటారు.
* దీన్ని పూర్తిగా తెలంగాణ పౌరులే పొందేలా ప్రోగ్రామింగ్‌ చేయనున్నారు.
* భూ రికార్డులు, జనన, మరణ, కుల ధ్రువీకరణ పత్రాలు ఇలా ప్రభుత్వం నుంచి పౌరులు ఈ యాప్‌ ద్వారా పొందవచ్చు.
* దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వ సమాచారం, జీవోలు పొందవచ్చు.

వివిధ పోర్టళ్లకు అనుసంధానం
జనతా జనార్దన్‌ యాప్‌ రూపకల్పనపై కార్యదర్శులకు సీఎస్‌ జోషి ప్రాథమిక సమాచారమిచ్చారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. తుది ప్రతిపాదనలను త్వరలోనే ఖరారు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పిస్తారు. ఆయన అనుమతి తర్వాత దీనిని విడుదల చేయనున్నారు. తర్వాత వివిధ పోర్టళ్లకు దీనిని అనుసంధానం చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ యాప్‌ వివరాలను వెల్లడించి, భారత ప్రభుత్వ వెబ్‌సైట్లకు కూడా అనుసంధానం చేయడానికి అనుమతి కోరతారు. కేంద్రం అనుమతి లభిస్తే వారి సమాచారం కూడా పొందవచ్చు. తద్వారా రాష్ట్రానికి సంబంధించిన సమాచారం కేంద్రానికి అందుబాటులో ఉండటమే కాకుండా వివిధ కేంద్ర ప్రభుత్వ సేవలు తెలంగాణ పౌరులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయనున్నారు.


ఇదో వినూత్న విధానం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి

జనతా జనార్దన్‌ మొబైల్‌ యాప్‌ విప్లవాత్మకమైనది. వినూత్న విధానంతో, సరళమైన పద్ధతిలో, పారదర్శకంగా, అవినీతిరహితంగా, జవాబుదారీతనంతో కూడుకున్న పరిపాలనను ప్రజలకు అందించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఉపయోగంలోకి వచ్చాక పౌరుల నుంచి విశేషాదరణ లభిస్తుంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.