Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219008726
            [news_title_telugu_html] => 

పాక్‌ను ఎండగట్టిన భారత్‌

[news_title_telugu] => పాక్‌ను ఎండగట్టిన భారత్‌ [news_title_english] => [news_short_description] => జమ్మూ-కశ్మీర్‌ అంశాన్ని మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పింది. ఆ రాష్ట్రంలో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి, నిర్బంధకాండ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
పాక్‌ను ఎండగట్టిన భారత్‌ - EENADU
close
పాక్‌ను ఎండగట్టిన భారత్‌

యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ‘కశ్మీర్‌ను’ లేవనెత్తడంపై తీవ్ర అభ్యంతరం
హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నది ఆ దేశమే
అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువు అదేనని స్పష్టీకరణ

జెనీవా: జమ్మూ-కశ్మీర్‌ అంశాన్ని మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పింది. ఆ రాష్ట్రంలో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి, నిర్బంధకాండ అమలు చేస్తున్నారని చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది. మంగళవారం ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) 42వ సదస్సు ఇందుకు వేదికైంది. కశ్మీర్‌లో పరిస్థితులపై ఈ మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దర్యాప్తు నిర్వహించాలన్న పాక్‌ డిమాండ్‌ను భారత్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఈ సదస్సులో తొలుత పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్‌ ఖురేషీ మాట్లాడగా.. అనంతరం దీన్ని ఎండగడుతూ, పాక్‌ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ విదేశాంగ శాఖ కార్యదర్శి (తూర్పు) విజయ్‌ ఠాకూర్‌ సింగ్‌ ప్రసంగించారు. పాక్‌ పేరు ప్రస్తావించకుండానే ఆ దేశాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. జమ్మూ-కశ్మీర్‌లో స్వయం ప్రతిపత్తి రద్దు అనేది తమ సార్వభౌమ నిర్ణయమని ఆమె స్పష్టంచేశారు. ‘‘ఇతర దేశాల్లోని మైనార్టీల హక్కుల గురించి మాట్లాడుతున్నవారు స్వదేశంలో యథేచ్ఛగా వాటిని ఉల్లంఘిస్తున్నారు’’ అని మండిపడ్డారు.

రాజ్యాంగానికి లోబడే..
‘‘జమ్మూ-కశ్మీర్‌కు సంబంధించిన నిర్ణయాలను మా పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ తర్వాతే తీసుకున్నాం. ఆ నిర్ణయానికి విస్తృత మద్దతు లభించింది. ఇది మా అంతర్గత వ్యవహారం. అందులో ఇతరుల జోక్యాన్ని ఆమోదించబోం’’ అని విజయ్‌ఠాకూర్‌ సింగ్‌ పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో ఆంక్షలను క్రమంగా తగ్గిస్తున్నామని, సీమాంతర ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో పౌరుల భద్రత కోసమే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఉగ్రవాద కేంద్రం నుంచి ఈ మాటలా?
పాక్‌ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్‌ ఖురేషీ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘‘ఒక ప్రతినిధి బృందం మా దేశానికి వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు, వక్రీకరించిన అభియోగాలతో కూడిన పరుష పదజాలంతో రన్నింగ్‌ కామెంట్రీ ఇచ్చింది. అయితే అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దేశం నుంచి ఈ ఆరోపణలు వస్తున్నాయని ప్రపంచం మొత్తం గుర్తించింది. ఆ దేశంలో ఏళ్ల తరబడి ముష్కర నాయకులకు ఆశ్రయం లభిస్తోంది. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రత్యామ్నాయ దౌత్య’ మార్గంగా ఆ దేశం ఉపయోగించుకుంటోంది’’ అని విజయ్‌ఠాకూర్‌ సింగ్‌ దుయ్యబట్టారు. ఉగ్రవాదులకు, వాటికి మద్దతుగా నిలిచేవారిపై ఉమ్మడిగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘‘మనం నోరు విప్పాలి. మన మౌనంతో ఉగ్రవాదులు పేట్రేగిపోతారు. దీనివల్ల వారి బెదిరింపు ఎత్తుగడలను ప్రోత్సహించినట్లవుతుంది. ఉగ్రవాదంపై పోరులో అంతర్జాతీయ సమాజం కలసిరావాలి’’ అని కోరారు. అసోంలో జాతీయ పౌర పట్టిక అంశంపై స్పందిస్తూ ‘‘ఈ అంశం అమలుకు తీసుకున్న నిర్ణయాలన్నీ భారత చట్టాలకు, ప్రజాస్వామ్య విలువలకు లోబడి ఉంటాయి’’ అని విజయ్‌ ఠాకూర్‌ సింగ్‌ చెప్పారు.

అంతర్జాతీయ దర్యాప్తు అవసరం: పాక్‌
పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ మాట్లాడుతూ.. కశ్మీర్‌లో పరిస్థితులపై ఐరాస మానవహక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని భారత్‌ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో దీనిపై నిర్లిప్తత పనికిరాదన్నారు. కశ్మీర్‌ ప్రజలకు ప్రాథమిక హక్కులనూ నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనేనని పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం అక్రమమన్నారు. అనంతరం ‘ప్రతిస్పందన హక్కు’ను ఉపయోగించుకుంటూ భారత విదేశాంగ శాఖలో ఫస్ట్‌ సెక్రటరీ విమార్ష్‌ ఆర్యన్‌ పాక్‌ తీరును దుయ్యబట్టారు. కశ్మీర్‌పై యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దర్యాప్తు చేపట్టాలన్న పాక్‌ డిమాండ్‌ను ‘పిచ్చి ప్రేలాపన’గా అభివర్ణించారు. యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సమావేశం అనంతరం పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ విలేకరులతో మాట్లాడారు. మాటల మధ్యలో ఆయన జమ్మూ-కశ్మీర్‌ను భారత రాష్ట్రంగా అభివర్ణించారు. ఇప్పటివరకూ ఈ రాష్ట్రాన్ని ‘భారత పాలనలోని కశ్మీర్‌’గా పాక్‌ అభివర్ణిస్తోంది.

పాక్‌ పత్రంలో రాహుల్‌, ఒమర్‌ వ్యాఖ్యలు
జమ్మూ-కశ్మీర్‌పై యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి సమర్పించేందుకు పాకిస్థాన్‌ రూపొందించిన ఒక పత్రంలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లాల వ్యాఖ్యలు ఉన్నాయి. ‘‘గత 20 రోజులుగా జమ్మూ-కశ్మీర్‌ ప్రజల పౌర హక్కులు హననానికి గురయ్యాయి. విపక్ష నేతలు, విలేకరులు నిరంకుశ పాలనను చవిచూశారు. మేం శ్రీనగర్‌ సందర్శించడానికి ప్రయత్నించినప్పుడు జమ్మూ-కశ్మీర్‌ ప్రజలపై దారుణ అణచివేతకు దిగారు’’ అని రాహుల్‌ పేర్కొన్నట్లు ఆ పత్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని, దానివల్ల ప్రమాదకరమైన పరిణామాలు తప్పవని ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నట్లు కూడా వివరించింది. అయితే జమ్మూ-కశ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తోందంటూ గత నెల 28న రాహుల్‌ గాంధీ పాక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.