Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219008751
            [news_title_telugu_html] => 

హనుమానం లేదు.. వీళ్లు మారలేదు

[news_title_telugu] => హనుమానం లేదు.. వీళ్లు మారలేదు [news_title_english] => [news_short_description] => ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటన.. 65 మంది ప్రయాణికుల ఉసురుతీసిన విషాదం 54 మంది క్షతగాత్రులను ఇప్పటికీ కలవరపరుస్తున్న ఘోర ఉదంతం..కొండగట్టు బస్సు ప్రమాదం.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,27,26, ) )
హనుమానం లేదు.. వీళ్లు మారలేదు - EENADU
close
హనుమానం లేదు.. వీళ్లు మారలేదు

కొండగట్టు ప్రమాదం జరిగి నేటికి ఏడాది
కొత్త బస్సులు లేక రద్దీ యథాతథం
కలవరపరుస్తున్న ప్రయాణాల తీరు

ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటన.. 65 మంది ప్రయాణికుల ఉసురుతీసిన విషాదం 54 మంది క్షతగాత్రులను ఇప్పటికీ కలవరపరుస్తున్న ఘోర ఉదంతం..కొండగట్టు బస్సు ప్రమాదం..

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: న్యూస్‌టుడే- జగిత్యాల విద్యానగర్‌:  సరిగ్గా ఏడాది కిందట సంభవించిన ఈ ప్రమాదం తాలూకు చేదు జ్ఞాపకం పీడకలలా వెంటాడుతోంది.అయినా బస్సు ప్రయాణాల తీరులో మార్పు కనిపించకపోవడం కలవరపరుస్తోంది. కొండగట్టు ప్రమాదానికి కారణమైన ఘాట్‌ రోడ్డులో బస్సు ప్రయాణాన్ని నిలిపివేసినా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు రహదారుల్లో ఇప్పటికీ పరిమితికి మించిన జనంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తూనే ఉన్నాయి.అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కడుతూనే ఉన్నాయి.
 

ఇంకా అదే ధోరణి!
భారీ ప్రమాదం నుంచి ఆర్టీసీ ఇంకా గుణపాఠాన్ని నేర్చుకోలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త బస్సుల ఊసే లేకపోవడంతో బస్సు సామర్థ్యం 55 మందిని మించి 100 మందికి పైగా ప్రజలు ప్రయాణించాల్సి వస్తోంది. ఇటీవల తనిఖీల్లో 100కుపైగా ప్రయాణికుల్ని ఓ బస్సులో రవాణాశాఖ అధికారులు  గుర్తించారు.
అన్ని డిపోల్లోనూ డ్రైవర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య మేరకు బస్సుల సంఖ్య పెరగడం లేదు. పల్లె వెలుగు బస్సుల సంఖ్య    పెరగకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాల్లో రద్దీ అధికమవుతోంది.

కంటితుడుపు చర్యలేనా..?
కొండగట్టు ప్రమాదం తర్వాత క్షేత్రస్థాయి పరిస్థితుల్లో అనుకున్న స్థాయిలో రవాణాపరంగా మార్పులు జరగలేదు. ప్రమాదం జరిగిన ఘాట్‌ రోడ్డులో మాత్రం రోడ్డుకిరువైపులా పలుచోట్ల ప్రహరీలను నిర్మించారు. బస్సు ప్రయాణాల్ని ఈ మార్గంలో నిలిపివేశారు. కానీ కింది నుంచి  కొండపైకి వెళ్లేందుకు చిన్న వాహనాల్ని మాత్రం అనుమతిస్తున్నారు. ఈ మార్గాన్ని నాలుగు వరసలుగా విస్తరించాలనే ప్రతిపాదన ఆమోదానికి నోచుకోవడంలేదు.
ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.10 లక్షల పరిహారం అందింది. కొంతమంది క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందాల్సి ఉంది.
కొండగట్టు ఘటనపై ప్రత్యేక విచారణ అధికారి అప్పట్లోనే ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యల కోసం రోడ్డు రక్షణ కమిటీలను సైతం అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశారు.రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించడం, నివారణ చర్యలు తీసుకోవడం కమిటీ బాధ్యతగా ఉన్నా ఈ తరహా గుర్తింపుల తీరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.


రూ. 4 లక్షలు చెల్లించలేక వదిలేశారు...

ఈ బస్సు కొండగట్టు ఘాట్‌రోడ్డుపై సరిగ్గా ఏడాది క్రితం  అదుపుతప్పి 65 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకొంది. అధికారులు దీనిని 2018 సెప్టెంబరు 14న లోయలోంచి బయటికి తీయించి మల్యాల ఠాణాకు తరలించారు. జిల్లా రవాణా అధికారులు, ఫోరెన్సిక్‌ అధికారులు బస్సులోని ప్రతి భాగాన్ని పరిశీలించి ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధ్యయనం చేశారు. బస్సును విడిపించేందుకు కోర్టులో రూ.4 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉండటంతో ఆర్టీసీ అధికారులు వదిలేశారు.వారి నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనంగా ఈ బస్సు ఠాణా ఎదుట కనిపిస్తోంది.

 

- న్యూస్‌టుడే, మల్యాల

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.