
అంచెలంచెలుగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ శాఖ నూతన మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలు, ఫలితాల్లో తప్పుల్లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల శ్రేయస్సుకు పాటుపడటమే తన లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. తొలిసారి రాష్ట్ర మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన గంగుల.. తనకు అప్పగించిన శాఖలను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను విశ్వాసంతో నెరవేరుస్తానని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులైన సత్యవతి రాఠోడ్ తెలిపారు.
ముగ్గురు మంత్రులు మంగళవారం ఈనాడు ముఖాముఖిల్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అంచెలంచెలుగా విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తా సబితా ఇంద్రారెడ్డి
విద్యాశాఖలో సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? అక్షరాస్యతపరంగా రాష్ట్ర స్థానాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేస్తారు ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల్లో తప్పులు దొర్లాయి. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఇలాంటి వాటిపై మీ ప్రణాళిక ఏమిటి? బోధనా సిబ్బంది, ఉపకులపతుల ఖాళీలను భర్తీ చేయడం లేదన్న విమర్శలపై ఏమంటారు? |
బీసీల మోములో వెలుగులతోనే సంతోషం
బీసీల సంక్షేమానికి ఎలాంటి ప్రాధాన్యమిస్తారు? పౌరసరఫరాల శాఖలో ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు..? పార్టీలో మున్ముందు మీ పాత్ర ఎలా ఉండనుంది? మంత్రిగా మీ లక్ష్యాలు ఏమిటి? ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలతో ఎలాంటి సంబంధాలుంటాయి. కార్పొరేటర్‌గా గెలిచినప్పుడు ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నానో.. ఎమ్మెల్యే అయ్యాకా అలాగే ఉన్నా. నేడు మంత్రిగా మారినా ‘ఈ మనిషి మారడు’ అనేలా ప్రజలతో కలిసిపోయి సేవ చేస్తా. సీఎం కేసీఆర్ నాకు డిక్షనరీలాంటి వ్యక్తి. ఆయనను చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్నా. సీఎం చెప్పినట్లు ‘ఎంత ఎదిగినా.. ఒదిగినట్లు ఉండాలె’ అనే విషయాన్ని కచ్చితంగా ఆచరణలో చూపిస్తా. |
గిరిజన బిడ్డగా కష్టాలన్నీ తెలుసు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తా సత్యవతి రాఠోడ్
సంక్షేమం కోసం ఎలా కృషిచేస్తారు? మీకు అప్పగించిన స్త్రీ,శిశు సంక్షేమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? నేటికీ ఆడపిల్ల పుడుతుందని తెలిసి కొందరు భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు కదా..? |
- ఈనాడు, హైదరాబాద్ - ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, కరీంనగర్
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు