Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009454
            [news_title_telugu_html] => 

ఆర్టీసీని గాడిలో పెడతాం

[news_title_telugu] => ఆర్టీసీని గాడిలో పెడతాం [news_title_english] => [news_short_description] => ఆర్టీసీని ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామని.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించి అధ్యయనం చేయిస్తామన్నారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
ఆర్టీసీని గాడిలో పెడతాం - EENADU
close
ఆర్టీసీని గాడిలో పెడతాం

ఆదాయ మార్గాలు అన్వేషిస్తాం
కఠిన నిర్ణయాలు తప్పవు
‘ఈనాడు’తో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఆర్టీసీని ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామని.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించి అధ్యయనం చేయిస్తామన్నారు. ఇటీవలే రవాణా శాఖ మంత్రిగా నియమితులైన అజయ్‌కుమార్‌ ‘ఈనాడు’ ముఖాముఖిలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఆర్థికంగా కుదేలైన ఆర్టీసీని ఎలా గట్టెక్కిస్తారు?
అవును, ఆర్థికంగా చాలా దారుణ పరిస్థితిలోనే సంస్థ ఉంది. ఆదాయాన్ని పెంచుకునే అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం. జవాబుదారీతనాన్ని మరింతగా పెంచుతాం. అవసరమైతే ప్రభుత్వ సాయం అందుకునేందుకు మార్గాలను అన్వేషిస్తాం. నష్టాలు భారీగా నమోదవుతున్నాయి. అప్పులూ పెరిగిపోతున్నాయి. అధిక శాతం నష్టాలు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే వస్తున్నాయి. వాటిని జీహెచ్‌ఎంసీ భరించేందుకు ఉత్తర్వులు ఇచ్చినా అమలు కావటం లేదు. వాటిపై దృష్టి పెడతాం. కొన్ని మార్గాలను హేతుబద్ధీకరిస్తాం.

జీతాలూ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది కదా.. ?
ఆర్థిక మాంద్యంతోపాటు అన్‌సీజన్‌ కావడంతో ఆదాయం గణనీయంగా తగ్గి ఈ పరిస్థితి తలెత్తింది. పండగలు ప్రారంభమయ్యాయి.. పరిస్థితి కొంత చక్కబడుతుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ సొమ్మునూ ఎప్పటికప్పుడు అందజేస్తాం. ఖర్చులు ఎక్కడన్నా ఎక్కువగా ఉంటే వాటిని నియంత్రించుకునేలా చర్యలు తీసుకుంటాం.

విద్యుత్తు శాఖ తరహాలో ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు కదా..?
అదొక్కటే పరిష్కారం కాదు. స్వయం సమృద్ధి సాధించేలా సంస్థను తీర్చిదిద్దగలిగితేనే ప్రయోజనం ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న ఇతర మార్గాలపై గతంలో కొంత కసరత్తు చేశారు. దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తా. డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆ భారం ఎక్కువగా ఉంది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సమ్మె నోటీసులు ఇస్తున్నారు. దీనిపై ప్రభుత్వ ఆలోచన ఏమిటి?
తొలిసారి బస్‌ భవన్‌కు వచ్చీరాగానే సమ్మె నోటీసుల సెగ తగులుతోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా. కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే కమిటీ నియమించి చర్యలను తీసుకుంటాం. ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని రంగాలపై పడుతున్న ప్రస్తుత తరుణంలో వ్యవస్థను కాపాడుకునేందుకు కార్మికులు, అధికారులు మరింత వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలి.

ట్రాఫిక్‌ అతిక్రమణలపై కేంద్రం అపరాధ రుసుమును భారీగా పెంచింది.. వాటిని అమలు చేస్తారా?
కేంద్రం చేసిన సవరణలను అమలు చేయాలా? వద్దా? అన్న దానిపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంది. అపరాధ రుసుము ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ నిబంధనల అమలు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తగ్గించొచ్చా? లేదా? తగ్గిస్తే ఏ స్థాయిలో అన్నది ఖరారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది.  నివేదిక వచ్చాక ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రమాదాలు తగ్గించేందుకు వాహనదారుల్లో స్వీయ నియంత్రణ చాలా అవసరం.

రవాణా శాఖలో ఆధునికీకరణ ఆలోచనలేమైనా ఉన్నాయా?
అవినీతిని తగ్గించాలంటే ఆధునికీకరణ చాలా అవసరం. ప్రజలు రవాణా శాఖ కార్యాలయాలకు రాకుండా ఆన్‌లైన్‌ వ్యవస్థలోనే పలు సదుపాయాలు అందేలా చూస్తే అవినీతికి ఆస్కారం ఉండదు. ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తున్నారు. వాటి పటిష్ఠానికి మరిన్ని చర్యలు తీసుకుంటాం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.