Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009524
            [news_title_telugu_html] => 

సభకు, సమాజానికి వారధిగా ఉంటా

[news_title_telugu] => సభకు, సమాజానికి వారధిగా ఉంటా [news_title_english] => [news_short_description] => తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా తనకు లభించిన అవకాశాన్ని ప్రజల సేవకు ఉపయోగిస్తానని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. శాసనమండలి ఛైర్మన్‌ పదవికి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు మండలి సమావేశం ప్రారంభం కాగానే డిప్యూటీ స్పీకర్‌ నేతి విద్యాసాగర్‌ కొత్త ఛైర్మన్‌గా [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
సభకు, సమాజానికి వారధిగా ఉంటా - EENADU
close
సభకు, సమాజానికి వారధిగా ఉంటా

అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తా
శాసనమండలి నూతన ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టీకరణ
ఛైర్మన్‌గా ఏకగ్రీవ ఎన్నిక.. బాధ్యతల స్వీకరణ
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా తనకు లభించిన అవకాశాన్ని ప్రజల సేవకు ఉపయోగిస్తానని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. శాసనమండలి ఛైర్మన్‌ పదవికి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు మండలి సమావేశం ప్రారంభం కాగానే డిప్యూటీ స్పీకర్‌ నేతి విద్యాసాగర్‌ కొత్త ఛైర్మన్‌గా గుత్తా ఎన్నికను ప్రకటించారు. అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య అధ్యక్ష స్థానంలోకి గుత్తాను డిప్యూటీ స్పీకర్‌ ఆహ్వానించారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌అలీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ తదితరులు గుత్తాను ఛైర్మన్‌ స్థానంలోకి తోడ్కొని వెళ్లారు. అనంతరం గుత్తాను అభినందిస్తూ మంత్రులు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘సభకు, సమాజానికి వారధిలా నా బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తా. ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలకు తరుణోపాయం చూపేలా చర్చలు ఉండేలా పెద్దల సభ హుందాగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరిగేలా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తా. సభ్యుల ప్రశంసల్ని ఆశీర్వచనాలుగా తీసుకుంటున్నా’’ అని తెలిపారు.

ఇది రైతులు సంబరపడే రోజు
గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీలకు అతీతంగా అందరితో సఖ్యతగా ఉంటూ అజాతశత్రువుగా ఉన్నారు. శాసనమండలిని హుందాగా, కార్యదక్షతతో నడుపుతారని ఆకాంక్షిస్తున్నా. వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా వ్యవహరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలి ఛైర్మన్‌ అయ్యారు. రైతు బిడ్డలు శాసన వ్యవస్థల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఇది రైతులు సంబరపడే రోజు. గుత్తా తొలినుంచి బలమైన తెలంగాణవాదిగా నిలిచారు.

- కేటీఆర్‌

నాడు కాంగ్రెస్‌లో ఉన్నా.. కేసీఆర్‌కు మద్దతు
గుత్తా సుఖేందర్‌రెడ్డిది రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం. పంచాయతీ సభ్యుడి నుంచి పార్లమెంట్‌ సభ్యుడివరకు పనిచేసి, మండలి ఛైర్మన్‌గా వచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఉద్యమ సమయంలో అధికార పార్టీలో ఉన్నప్పటికీ తెరాస ఉద్యమానికి, కేసీఆర్‌కు మద్దతు ఇచ్చారు. మంత్రిగా నల్గొండ వెళ్లినప్పుడు భోజనానికి తన ఇంటికి గుత్తా ఆహ్వానించారు. బయట మొక్క నాటిన తర్వాతే ఇంట్లో ఆతిథ్యమిచ్చారు. ఆయనలో ఓ రైతు, మంచి హరిత ప్రేమికుడు ఉన్నారు.

- హరీశ్‌రావు

ప్రజా సమస్యలకు అవకాశం కల్పించాలి
సంఖ్యా బలంతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలకు అవకాశాలు ఇవ్వాలి.

- జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ

మావంతు సహకారం అందిస్తాం
ప్రతిపక్ష సభ్యులకూ తగిన అవకాశాలు ఇవ్వాలి. సభను సజావుగా నడిపేందుకు మావంతు సహకారం అందిస్తాం.

- రామచందర్‌రావు, భాజపా ఎమ్మెల్సీ
ఇద్దరూ ఆజానుబాహులే
మండలి సమావేశంలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆజానుబాహులైన మీరు ఆ స్థానంలో కూర్చుంటే అధ్యక్ష స్థానానికి నిండుతనం వచ్చిందని వ్యాఖ్యానించగా.. ఇతర సభ్యులు స్పందిస్తూ ఇద్దరూ ఆజానుబాహులే, పరస్పరం పొగుడుకుంటున్నారనడంతో సభలో నవ్వులుపూశాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.