close
 ప్రమాద ఘటన విచారకరం

- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

‘‘గోదావరిలో యాత్రికుల బోటు ప్రమాద ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’

సురక్షితంగా బయటపడాలి
- కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

బోటు ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గల్లంతైన వారు సురక్షితంగా బయటపడాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.

ప్రాణాలు కోల్పోవడం బాధాకరం
- పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

పడవ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గల్లంతైన ప్రయాణికులను రక్షించాలని ప్రార్థిస్తున్నా.

సహాయక చర్యలు వేగవంతం
- ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

గోదావరి బోటు ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేయాలి.

యుద్ధప్రాతిపదికన స్పందించాలి
- తెదేపా అధినేత చంద్రబాబు

బోటు ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. పాపికొండలకు వెళ్తూ పర్యాటకులు, సిబ్బంది ప్రమాదానికి గురికావడం దురదృష్టకరం. జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించాలి. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలి.

బోటు ప్రమాదం కలిచివేసింది
- ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

బోటు ప్రమాదం తీవ్రంగా కలిచి వేసింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. రాజమహేంద్రవరం, విశాఖ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెళుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట నిబంధనలు తీసుకొస్తాం. బోటులో పరిమితికి మించి ప్రయాణికులు తరలించకుండా చర్యలు తీసుకుంటాం.

హెచ్చరించకపోవడమే కారణం
- జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

వరద సమయంలో పర్యాటకం ప్రమాదకరమని హెచ్చరించక పోవడం వల్లే ఈ ఘోరం జరిగింది. వరద ఉద్ధృతిలో బోటు నదిలోకి వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించాలి. శాఖల మధ్య సమన్వయంతో ప్రమాదాలకు తావులేకుండా జల పర్యాటకాన్ని తీర్చిదిద్దాలి.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
- భాజపా ఎంపీ జీవీఎల్‌

బోటు ప్రమాదం అత్యంత బాధాకరమైనది.  ప్రమాదానికి గురైన బోటుకు అనుమతులు లేవు అని అధికారులు చెబుతున్నారు. ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన, సంబంధిత వ్యక్తులు, అధికారులపై చర్యలు తీసుకోవాలి.

సహాయక చర్యలు ముమ్మరం చేయండి
- భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా

ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలి.

ఆందోళనకరం
- ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

ప్రమాద సమయంలో 60 మంది ప్రయాణికులు ఉన్న బోటు నుంచి 20 మందే సురక్షితంగా బయటపడటం ఆందోళనకరం.

దోషులను కఠినంగా శిక్షించాలి
- సీపీఎం ఏపీ కార్యదర్శి మధు

లైఫ్‌ జాకెట్ల పరిమితి మేరకే ప్రయాణికులను బోటులో అనుమతించాలి. ప్రభుత్వ నియంత్రణ లోపించడమే ప్రమాదానికి కారణం. ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి.

సమగ్ర దర్యాప్తు జరపాలి
- సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ

ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలి. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి.

ప్రభుత్వం అండగా ఉంటుంది
- ఏపీ మంత్రి సురేష్‌

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

ఇది ప్రభుత్వ వైఫల్యమే
- తెదేపా నేత యనమల

జలవనరులు, పర్యాటక శాఖల మధ్య సమన్వయం లేదు. గోదావరికి వరద పోటెత్తుతుంటే బోటును ఎలా అనుమతించారు? దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.