close
ప్రాణాలకు తెగించి.. పలువురిని కాపాడి

స్థానిక మత్స్యకారుల చొరవతో 26 మంది సురక్షితం

ఈనాడు, కాకినాడ: బోటు ప్రమాద ఘటనలో బాధితుల ప్రాణాలను కాపాడటంలో ఆ ప్రాంత మత్స్యకారుల చొరవ ప్రశంసలు అందుకుంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కచ్చులూరు మందం, తూటిగుంట గ్రామాలకు చెందిన మత్స్యకారులు, స్థానిక యువకులు అందుబాటులో ఉన్న పడవలతో సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. లైఫ్‌ జాకెట్లతో నీటిలో అల్లాడుతూ మృత్యువుతో పోరాడుతున్న 26 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఒక్కొక్కరిన్నీ తాము తెచ్చిన పడవల్లో ఎక్కించారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న మరో ముగ్గురు తుదిశ్వాస విడిచారు. ‘ఈ ప్రాంతంలో ప్రయాణం పులినోట్లో తలపెట్టినట్లే’నని మత్స్యకారులు పేర్కొనడం ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తోంది. దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నా అటువైపు ఎప్పుడూ వెళ్లమని మత్స్యకారులు తెలిపారు. కచ్చులూరు మందం, తూటిగుంట కొండల మధ్య దూరం 300 మీటర్లు వెడల్పు ఉండటం వల్ల లోతు ఎక్కువన్నారు. ఇక్కడ నీటి ఒరవడి తీవ్రంగా ఉండటంతో పెద్దపెద్ద సుడులు ఏర్పడుతుంటాయని చెప్పారు.

నిర్లక్ష్యమే కొంప ముంచిందా?
* గోదావరి ఉద్ధృతిని బోటు నిర్వాహకులు అంచనా వేయలేకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనే వాదన వినిపిస్తోంది. ఎగువ నుంచి కిందకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్న సమయంలో బోటును తీసికెళ్లటం కూడా ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
* నిబంధనల ప్రకారం 20 మంది కంటే అధికంగా ఉన్న ప్రయాణికులుండే బోటుకు రెండు ఇంజన్లుండాలి.
* ఈ బోటును ఒక్క ఇంజనుతోనే నడిపించారు. అందుబాటులో రెండో ఇంజను ఉన్నా దానికి మరమ్మతులు చేయలేదు.
* ప్రయాణికులకు పూర్తిస్థాయిలో లైఫ్‌ జాకెట్లు, లైఫ్‌బాయ్స్‌ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచలేదని తెలుస్తోంది.
* గోదావరి వరదల సమయంలో పలుచోట్ల భారీగా ఇసుక మేటలు వేసింది. ఈ క్రమంలో లోతు అంచనా వేయలేకపోవడం ప్రమాదానికి ఓ కారణంగా భావిస్తున్నారు.
* ఈ ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలపై అంచనా లేకపోవడమూ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది.

- ఈనాడు, అమరావతి


వీరు మృత్యుంజయులు
అంతలోనే ఆత్మీయులు కనిపించక నిర్వేదం

లహోరుకు ఎదురొడ్డి వారు మృత్యుంజయులయ్యారు. క్షణాల వ్యవధిలోనే ఆత్మీయులు కనిపించక వారిలో ఆవేదన, ఆక్రందన మిన్నంటింది. అప్పటివరకు నవ్వుతూ, తుళ్లుతూ వెంట ఉన్న కుటుంబీకులు, స్నేహితులు ఎక్కడున్నారో తెలియక వెదుకులాడుతూ, వెక్కివెక్కి ఏడుస్తూ వారు పడ్డ బాధ వర్ణనాతీతం. ప్రమాద సంఘటనలో 26 మంది సురక్షితంగా బయపడ్డారు. ఓ ఇద్దరు అక్కడినుంచి వెళ్లిపోవడంతో వారి వివరాలు తెలియలేదు. మృత్యుంజయుల వివరాలివి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.