close
మహారాష్ట్రలో 8 చోట్ల ఎన్నికల బరిలో తెరాస!

నాందేడ్‌ జిల్లాలోని 5 నియోజక వర్గాల్లో టికెట్ల కోసం అక్కడి నేతల వినతి
మరో మూడు చోట్లా పోటీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూత్రప్రాయ అంగీకారం
త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తామన్న సీఎం
శాసనసభ కార్యాలయంలో కేసీఆర్‌తో మహారాష్ట్ర నేతల భేటీ
తెలంగాణలో కలపాలనే డిమాండ్‌తో పోటీ చేస్తామని వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌

త్వరలో మహారాష్ట్రలో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. నాందేడ్‌ జిల్లాలోని 5 నియోజకవర్గాలు, ఇతర ప్రాంతాల్లోని మరో 3 నియోజకవర్గాలు కలిపి మొత్తం 8 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశముంది. నాందేడ్‌ జిల్లా నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని శాసనసభ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయని పక్షంలో ఈ రాష్ట్రంలోనే కలపాలనే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. తమకు తెరాస టికెట్లు ఇవ్వాలని వారు కోరగా... ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. నాందేడ్‌ జిల్లా నయ్‌గావ్‌, బోకర్‌, డెగ్లూర్‌, కిన్వట్‌, హథ్‌ గావ్‌ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు బాబ్లీ సర్పంచి బాబురావు గణపతిరావు కదమ్‌ నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. త్వరలోనే కాంగ్రెస్‌, భాజపా శివసేన, ఎన్సీపీ తదితర పార్టీలకు చెందిన స్థానిక నాయకులను తీసుకొచ్చి కలుస్తామని చెప్పారు.

మీ కోరికలు సమంజసమే: కేసీఆర్‌
ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి, తమ గ్రామాల్లోనూ అలాగే జరగాలని అక్కడి ప్రజలు కోరుకోవడం సహజమని, ఆయా గ్రామాల సమంజసమైన కోరికను మహారాష్ట్ర ప్రభుత్వం మన్నిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నాందేడ్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజలతో పాటు బీవండి, షోలాపూర్‌, రజూర తదితర ప్రాంతాల నుంచి తెరాస టికెట్‌ కావాలని అడుగుతున్నారని, వారి వినతులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.