close
కాయిన్‌ బ్యాటరీ మింగి చిన్నారికి అస్వస్థత

సత్వర చికిత్సతో ఉపశమనం

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే: మూడేళ్ల చిన్నారి అస్వస్థతకు మూలకారణం అతడి గొంతులో ఇరుక్కున్న నాణెం(కాయిన్‌) ఆకారంలోని బ్యాటరీయేనని గుర్తించిన వైద్యులు సత్వరం చికిత్స చేసి వెలికితీశారు. సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాయిరాంపురంలో జరిగింది. కె.శివకృష్ణ-లక్ష్మి దంపతుల కుమారుడు చందు రెండు రోజులుగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అన్నం తినకుండా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు శుక్రవారం మధ్యాహ్నం పాల్వంచలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకురాగా అనుమానంతో వైద్యులు ఎక్స్‌-రే తీయించారు. కాయిన్‌ బ్యాటరీ గొంతులో ఉన్నట్లు గుర్తించి కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేసి బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.