close
ధూంధాంగా సమ్మె

ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సీఎం ఆదేశం
  ఆర్టీసీ కార్మికులకు వివిధ సంఘాల మద్దతు
 ప్రజలకు ఇబ్బందులు రానీయొద్దు: గవర్నర్‌
 సీఎస్‌కు ఉద్యోగులు, పింఛనర్ల ఐకాస విజ్ఞప్తి
 సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ

ఆర్టీసీ సమ్మె విషయంలో అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం అదే పట్టు కొనసాగిస్తున్నాయి. కార్మికులు రోజురోజుకు ఆందోళన కార్యక్రమాలతో సమ్మెను ఉద్ధృతం చేస్తుండగా.. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం మరింత శ్రద్ధ పెడుతోంది. బస్సుల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. సమ్మె గురువారానికి 13వ రోజుకు చేరుకోగా వారికి ఇతర వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈనెల 19 నాటి బంద్‌కు రాష్ట్ర మోటార్‌ ట్రాన్స్‌పోర్టర్ల ఐకాస, ఆటో డ్రైవర్ల యూనియన్‌ మద్దతు ప్రకటించాయి. తమ సమస్యలతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల, పింఛనర్ల ఐకాస ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కోరారు. ఆర్టీసీ సమస్య పరిష్కారం     కాకపోతే... బంద్‌లో పాల్గొంటామని వారు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ధూంధాం కార్యక్రమాలతో పాటు మౌనదీక్షలు, మానవహారాలు, వంటావార్పులు నిర్వహించారు. కళాకారులు పాటలతో ఉత్తేజపరచగా కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. ఉస్మానియా విద్యార్థులు ప్రగతిభవన్‌, బస్‌భవన్‌ల ముట్టడికి యత్నించగా వారు విశ్వవిద్యాలయ ప్రాంగణం దాటి బయటికి రాకుండా పోలీసులు నిలువరించారు. ఆర్టీసీ ఐకాస నాయకుడు అశ్వత్థామరెడ్డి స్వరం పెంచారు. ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సమ్మె విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని, చర్చలకు ప్రభుత్వం ఆహ్వానిస్తే సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. మరోవైపు సమ్మె నేపథ్యంలో పకడ్బందీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం వినిపించాల్సిన వాదనల గురించి సీఎం చర్చించారు. గవర్నర్‌ తమిళిసై సైతం ఆర్టీసీ సమ్మెపై రాజ్‌భవన్‌లో సమీక్షించారు. ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూడాలని ఆమె సూచించారు. సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అధికారులకు సూచనలిచ్చారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.