
ఏటా రూ.1200 కోట్ల నష్టం
వచ్చే ఆదాయంలో 58 శాతం జీతాలకే
హైకోర్టులో ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ అదనపు కౌంటరు
ఈనాడు, హైదరాబాద్: ‘‘ఏటా రూ.1200 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో యూనియన్ల డిమాండ్ మేరకు వేతనాలను పెంచడమంటే సంస్థను దెబ్బతీయడమే. సంస్థ ద్వారా వచ్చే సొమ్ములో 58 శాతం వేతనాలకే సరిపోతోంది’’ అని ఆర్టీసీ హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ సాయం లేకుండా సొంత నిధుల నుంచి జీతాలు చెల్లించే పరిస్థితిలో సంస్థ లేదని.. ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టులో అదనపు కౌంటరు దాఖలు చేశారు. ముఖ్యాంశాలివీ..
* ఆర్టీసీకి 2014-15 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు రూ.4253.35 కోట్లను ప్రభుత్వం కేటాయించగా, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాటాగా 5 ఏళ్లకు కేవలం రూ.712 కోట్లు కేటాయింపులున్నాయి. కార్మికుల వేతనాలను 67 శాతం పెంచాం. ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో 58 శాతం వేతనాలకే సరిపోతోంది. 2015 వేతన సవరణలో భాగంగా 44 ఫిట్మెంట్ ప్రకటించగా ఇది ఏడాదికి రూ.900 కోట్లు అవుతోంది. 2017లో యూనియన్ల డిమాండ్ మేరకు మధ్యంతర భృతి కింద 2018 జులై నుంచి 16 శాతం ప్రకటించగా ఇది ఏడాదికి రూ.200 కోట్లవుతోంది. నెలసరి వేతనాలుగానే రూ.239.68 కోట్లు ఖర్చవుతోంది.
* నడుస్తున్న 10460 బస్సుల్లో 8357 కార్పొరేషన్ సొంతం. మిగిలినవి 2103 బస్సులు అద్దెకు నడుస్తున్నాయి. మొత్తం ఆదాయం రూ.4882 కోట్లు కాగా 5,811 కోట్లు ఖర్చవుతోంది.
* ఈ ఆగస్టు నాటికి కార్పొరేషన్‌కు ఉన్న మొత్తం రుణం 5269.25 కోట్లు. ఇందులో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, పీఎఫ్, సెలవుల సొమ్ము, పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన వాటితో పాటు ఇతర రుణాలున్నాయి. ఇదికాకుండా 2600 బస్సులను మార్చడానికి అదనంగా రూ.829 కోట్లు అవసరం. ఏడాదికి రూ.1200 కోట్ల నష్టం వాటిల్లుతోంది.
* సమ్మె వల్ల రూ.125 కోట్ల అదనపు నష్టం. ప్రస్తుతం కార్పొరేషన్ ఖాతాలో కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఉన్నాయి.
* సంస్థ సొంత వనరుల నుంచి నెల మొదట్లో వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు. ప్రభుత్వ సాయంతోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ స్థితిలో వేతనాలను పెంచడం అంటే సంస్థ దెబ్బతీయడమే. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పట్టించుకోకుండా ఐకాస 5 నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..