close
ట్యాక్సీడ్రైవర్ల సమ్మె విరమణ

గవర్నర్‌ సూచనల మేరకు నిర్ణయం
సమస్యలపై వినతిపత్రం సమర్పణ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ట్యాక్సీడ్రైవర్ల ఐకాస సమ్మె విరమించుకుంది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వినతి మేరకు శనివారం రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ట్యాక్సీడ్రైవర్ల  ఐకాస ప్రతినిధులు సలావుద్దీన్‌, ఈశ్వర్‌రావు, వెంకటేశం, నాగేశ్‌, కొండల్‌రెడ్డి, ఆరిఫ్‌అలీ తదితరులు గవర్నర్‌ను శనివారం రాత్రి రాజ్‌భవన్‌లో కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని గవర్నర్‌ వారికి తెలిపారు.ట్యాక్సీడ్రైవర్లు సరైన పద్ధతిలో ప్రభుత్వం వద్దకు వెళ్లి సమస్యలను వివరించాలని గవర్నర్‌ వారికి సూచించారు. సమ్మె ద్వారా ప్రజలను, సామాన్యులను అసౌకర్యానికి గురిచేయవద్దని, వెంటనే ట్యాక్సీలు  నడపాలని గవర్నర్‌ వారిని కోరారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించి, సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.