close
ప్రచారపర్వం పరి సమాప్తం

రేపు ముంబయి, హరియాణాల్లో ఎన్నికలు
16 రాష్ట్రాల్లోనూ ‘ఉప’పోరు
పోలింగ్‌ తేదీ: అక్టోబరు 21
ఓట్ల లెక్కింపు: అక్టోబరు 24

ముంబయి/చండీగఢ్‌: విమర్శలు, ప్రతివిమర్శలు.. హామీలు.. నిర్విరామ పర్యటనలతో హోరెత్తించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఈనెల 21న దేశంలో మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్రలో 288, హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలుండగా వరుసగా 3,237; 1,169 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ అన్నిచోట్ల ప్రచారం పూర్తికాగా అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర, హరియాణాల్లో ప్రధాని నరేంద్ర మోది, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు కేంద్ర మంత్రులు, పార్టీ కీలక నేతలు.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఇతర పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో భాజపా మిత్రపక్షమైన శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సహా పార్టీ కీలకనేతలు ప్రచారం చేశారు. అలాగే ప్రతిపక్ష కూటమికి చెందిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌ ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. మహారాష్ట్ర, హరియాణాల్లో భాజపాకు చెందిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌; ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర నేతలు నిర్విరామంగా ప్రచారం చేశారు.

 

ఉప సమరం
ఉత్తర్‌ప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. భాజపా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను నిలిపాయి. రాష్ట్రంలో 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వీటిని ‘సన్నాహకం’గా భావిస్తూ ఆయా పార్టీలు ప్రచారం నిర్వహించాయి. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్‌లోని సమస్తీపుర్‌ లోక్‌సభ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, గుజరాత్‌, రాజస్థాన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, బిహార్‌, అసోం, మేఘాలయ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరీల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

భారీ బందోబస్తు
3,00,000

మహారాష్ట్రలో పోలింగ్‌ సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలు సహా 3 లక్షల మంది భద్రత సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 350 కంపెనీల సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, నాగాలాండ్‌ మహిళా పోలీసు దళాలు రంగంలోకి దిగాయి. ముంబయిలోని పలుచోట్ల, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నారు.

75,000

హరియాణాలో ఎన్నికలకు 75 వేల మంది భద్రత సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నారు. 130 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించాయి.

రెండు రాష్ట్రాల్లో 1,703 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు
 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.