close
దేశంలో నేరాలు పెరిగాయ్‌

హత్యలు తగ్గాయి
చోరీ సొత్తు రికవరీ అంతంత మాత్రం
2017 నివేదికను విడుదల చేసిన ఎన్‌సీఆర్‌బీ

ఈనాడు, దిల్లీ: దేశంలో నేరాలు పెరిగాయి. సోమవారం విడుదలైన 2017 జాతీయ నేర గణాంకాల మండలి (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం అంతకుముందు ఏడాది కంటే 3.6% నేరాలు పెరిగినట్లు తేలింది.
* అపహరణ కేసులు 9% పెరిగాయి. 1,00,555 మంది కిడ్నాప్‌ కాగా వారిలో 96,650 మందిని కనుగొన్నారు.
* మహిళలపై భర్తలు, వారి బంధువుల క్రూరత్వానికి సంబంధించిన కేసులు: 33.2%
* పిల్లలపై నమోదైన కేసుల్లో 42% కిడ్నాప్‌వే. బాలలపై లైంగిక దాడుల కేసులు: 25.3%
* ఆర్థిక నేరాల కేసులు: 1,27,430. విశ్వాసఘాతుకం, ఫోర్జరీ, మోసం, నకిలీ నోట్లకు సంబంధించినవే ఇవన్నీ.
* చోరీ అయిన ఆస్తులు: రూ.5,002 కోట్లు. రికవరీ: రూ.1,296 కోట్లు
* అత్యధిక నేరాలు నివాస ప్రాంతాల్లో జరగ్గా, ఆ తర్వాత రహదారుల్లో చోటుచేసుకున్నాయి.
* ఏపీలో 2017లో 1,32,336 ఐపీసీ కేసులు నమోదయ్యాయి. దేశంలో దీని వాటా 4.3%.
* తెలంగాణలో 1,19,858 కేసులు నమోదయ్యాయి. దేశంలో వాటి వాటా 3.9%. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 10.1% కేసులు నమోదయ్యాయి.
* దేశంలో జైళ్లలో ఖైదీల సంఖ్య 7.4% పెరిగింది.
* హత్యలు 2017లో 2016 కంటే 5.9% తగ్గాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.