close
గిరిజన వర్సిటీకి కేంద్ర ఆమోదం లభించేలా కృషి

  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
  రాజ్‌భవన్‌లో గిరిజన సంక్షేమశాఖపై సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ములుగు జిల్లాలో మంజూరైన తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి సత్వరం కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించేలా కృషిచేస్తానని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. గిరిజన సంస్కృతి, సమస్యలను తెలుసుకునేందుకు వారుండే ప్రాంతాలకు వెళ్లి రాత్రిపూట అక్కడే బస చేస్తానన్నారు. అక్కడ లభించే మూలికలతో ఔషధ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు యువతను ప్రోత్సహించాలని సూచించారు. మంగళవారం గవర్నర్‌ రాజ్‌భవన్‌లో గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశమయ్యారు. ఆ శాఖ కార్యదర్శి బెనహర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా, కమిషనర్‌ క్రిస్టినా, గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ..‘‘గిరిజన ప్రాంతాల్లో సమృద్ధిగా లభించే మూలికల గురించి సమాచారం సేకరించి భద్రపరచాలి. గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రం ఆమోదం కావాలి. దీని కోసం ప్రయత్నిస్తాను. త్వరలో తండాలు, గిరిజన గూడేలను సందర్శిస్తాను. వైద్య విద్యార్థిగా అండమాన్‌ దీవులలోని మారుమూల గిరిజన ప్రాంతాలను స్నేహితులతో కలిసి సందర్శించాను’’ అని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలో గిరిజన సంక్షేమశాఖ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల గురించి వివరించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రం నిధులివ్వడం లేదని చెప్పారు. అంతకుముందు గవర్నర్‌ భద్రాచలం, నాగర్‌కర్నూల్‌ జిల్లాల కోయ, లంబాడీ కళాబృందాలతో కలిసి నృత్యం చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.