close
అవుటర్‌కు ఆవలే

281 కొత్త పరిశ్రమలకు స్పష్టం చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని పరిధిలో బాహ్య వలయ రహదారి (అవుటర్‌ రింగ్‌రోడ్డు) బయట మాత్రమే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీ, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ విధాన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా.. రూ.1200 కోట్ల మేర పెట్టుబడులతో వివిధ కేటగిరీల కింద రాజధాని పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అందిన 281 దరఖాస్తులను తిరస్కరించింది.

ఆయా పరిశ్రమలను అవుటర్‌ వెలుపల స్థాపించాలని ఆయా సంస్థలకు సూచించింది.  అలానే ఓఆర్‌ఆర్‌ బయట పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సానుకూల అంశాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది. జాతీయ రహదారుల అనుసంధానం, విమానాశ్రయానికి సమీపంలో ఉండడం వంటి అంశాలను ప్రస్తావిస్తోంది.

కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకే: రాజధానిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా కాలుష్య కారక పరిశ్రమలను తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో, సమీప ప్రాంతాల్లో ఉన్న 1746 పరిశ్రమలు కాలుష్య కారకాలుగా గుర్తించిన ప్రభుత్వం వాటిని ఓఆర్‌ఆర్‌ వెలుపల గుర్తించిన 19 ప్రాంతాలకు తరలించేందుకు  సిద్ధమవుతోంది. వీటితో పాటు మరో 600 పరిశ్రమలను ఔషధనగరి పరిధిలోకి తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.