close
ఆర్టీసీ కార్మికుల నిరసనలు, మానవహారాలు

కరీంనగర్‌లో సీఎం ఇంటి ముట్టడికి వామపక్షాల కార్యకర్తల యత్నం

సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారమూ కొనసాగింది.  ఆందోళనలో భాగంగా కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, మానవహారాలను నిర్వహించారు. సమ్మె నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం వాదనలు జరిగాయి. కేసును ఈ నెల 18వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. 6,557 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో 4,616 ఆర్టీసీ బస్సులు కాగా మిగిలినవి 1,941 అద్దె బస్సులని పేర్కొంది.
* సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు 40 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవటంపై నిరసన వ్యక్తం చేస్తూ వామపక్ష పార్టీల కార్యకర్తలు బుధవారం కరీంనగర్‌ శివారు తీగలగుట్టపల్లిలోని సీఎం కేసీఆర్‌ ఇంటి ముట్టడికి యత్నించారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పార్టీ కార్యకర్తలను అరెస్ట్‌చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
* ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస రీజియన్‌ కన్వీనర్‌ బి.దేవిదాస్‌చారి అన్నారు.
* జాతిపిత మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్రమోదీ వేషధారణలతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు బుధవారం ఆదిలాబాద్‌లో గాంధీ సంకల్ప ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.