close
భారత్‌లో అపార అవకాశాలు

  పెట్టుబడులపై పారదర్శకతతో వ్యవహరిస్తున్నాం
  సద్వినియోగం చేసుకోండి
  బ్రిక్స్‌ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు

బ్రసీలియా: భారత్‌...ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన దేశమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పారదర్శకతతో వ్యవహరిస్తూ, పెట్టుబడిదార్లతో స్నేహపూర్వకంగా మెలుగుతున్నామని చెప్పారు. అపార అవకాశాలు అందుబాటులో ఉన్నందున తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాలో జరుగుతున్న ‘బ్రిక్స్‌’ సమావేశాల్లో భాగంగా గురువారం మోదీ బిజినెస్‌ ఫోరం సదస్సులో ప్రసంగించారు.

చైనా అధ్యక్షుడితో భేటీ

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడుల రంగాల విషయమై చర్చలు కొనసాగిస్తుండాలని నిర్ణయించారు. సరిహద్దు సమస్యపై ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరపాలని ప్రతిపాదించారు. భారత్‌ నుంచి అత్యంత నాణ్యమైన సరకులు దిగుమతి చేసుకునేందుకు చైనా అంగీకరించింది.

మోదీకి పుతిన్‌ ఆహ్వానం

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ సమావేశమయ్యారు. వచ్చే ఏడాది మే 9న మాస్కోలో జరిగే ‘నాజీలపై విజయం’ 75వ వార్షికోత్సవానికి హాజరుకావాలని పుతిన్‌ కోరగా అందుకు మోదీ అంగీకరించారు. ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చల్లో నాగ్‌పుర్‌- సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్ల వేగం పెంపునకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

బ్రెజిల్‌ అధ్యక్షుడికి ఆహ్వానం

భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారోను ప్రధాని మోదీ ఆహ్వానించగా, అందుకు ఆయన అంగీకరించారు.

సులభతర వాణిజ్యం ఉండాలి

‘బ్రిక్స్‌’ దేశాల మధ్య సులభతర వాణిజ్యం ఉండాలి. ఒకరికి సాంకేతిక పరిజ్ఞానం ఉంటే మరొకరి వద్ద ముడిసరకులు ఉన్నాయి. ఇంకొకరి వద్ద మార్కెట్‌ ఉంది. వీటన్నింటినీ సమన్వయం చేసుకొని ఉపయోగించుకోవాలి. నూతన అభివృద్ధి బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని వీలైనంత త్వరగా భారత్‌లో ప్రారంభించాలి.
* ఉగ్రవాదంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోతోంది. గత పదేళ్లలో ఈ సమస్య కారణంగా 2.25 లక్షల మంది మరణించారు.

- ప్రధాని నరేంద్ర మోదీ

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.