close
పొద్దుగూకాకే ప్రమాదాలు ఎక్కువ

ప్రాణాలు కోల్పోతున్న వారిలో యువతే అధికం
కేంద్ర ఉపరితల రవాణాశాఖ తాజా గణాంకాల్లో వెల్లడి
- ఈనాడు, హైదరాబాద్‌

పొద్దుగూకేవేళ ప్రయాణం పెట్టుకుంటున్నారా? మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 - 9 గంటల మధ్యనే జరుగుతున్నాయి. కేంద్ర ఉపరితల రవాణాశాఖ 2018 సంవత్సరానికి సంబంధించి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా 4,485 ప్రమాదాలు సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యనే జరిగాయి. అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల మధ్య అత్యల్పంగా 1,043 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అలాగే ఎక్కువ ప్రమాదాలు మే నెలలోనే జరుగుతున్నట్లు పేర్కొంది. గత ఏడాది ఈ నెలలో 2,138 ప్రమాదాలు జరిగాయి. వేసవి సెలవులు, పెళ్లిళ్ల హడావుడే దీనికి కారణం. ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉంటున్నారు. వెల్లడించిన గణాంకాల ప్రకారం 25-35 ఏళ్ల మధ్య వయసు వారు అత్యధికంగా 1,848 మంది చనిపోయారు. ప్రమాదాల్లో మరణించిన పాదచారుల్లోనూ 35-45 సంవత్సరాల మధ్యవారు ఎక్కువగా ఉన్నారు. ఈ వయసు పాదచారులు 302 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ప్రధాన కారణాలు ఇలా..
సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కార్యాలయాల నుంచి ఇళ్ళకు వెళ్ళేవారు, వేరే ఊర్లలో ఉద్యోగాలు చేస్తూ ఇంటికి తిరిగి వస్తుండేవారితో ఆ సమయంలోనే ప్రయాణికుల వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. చీకటి పడితే దానికి అలవాటు పడడానికి డ్రైవర్లకు కొంత సమయం పడుతుంది. ఈ సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.