close

ప్రధానాంశాలు

పెరల్‌ హార్బర్‌!

అమెరికా నౌకాదళ స్థావరంలో కాల్పులు
ఇద్దరిని చంపి, నావికుడి ఆత్మహత్య
భారత వాయుసేనాధిపతి క్షేమం

హనలులు: చరిత్రాత్మక పెరల్‌ హార్బర్‌లో దారుణం చోటుచేసుకుంది. అమెరికా నౌకాదళానికి చెందిన ఒక నావికుడు ఇద్దరు పౌరులను కాల్చి చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరో పౌరుడు గాయపడ్డాడు. అదే స్థావరంలో ఉన్న భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ బదౌరియా, మన దేశానికి చెందిన ఇతర సిబ్బంది క్షేమంగా ఉన్నారు. భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలోని భద్రతా పరిణామాలపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన ఒక సదస్సులో పాల్గొనేందుకు వారు ఇక్కడికి వచ్చారు.

హవాయ్‌ దీవుల్లోని పెరల్‌ హార్బర్‌పై 1941 డిసెంబర్‌ 7న జపాన్‌ యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఇందులో 2300 మంది చనిపోయారు. ఈ ఘటనతో నాడు అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగింది. ఆనాటి దాడికి 78 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జపాన్‌ బాంబుదాడిలో తప్పించుకున్న కొద్దిమంది దీనికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల ఘటన కలవరపాటుకు గురిచేసింది. దీంతో భద్రతను మరింత పెంచాలా అన్నది పరిశీలిస్తామని హవాయ్‌ ప్రాంత నౌకాదళాధిపతి రియర్‌ అడ్మిరల్‌ రాబర్ట్‌ చాడ్‌విక్‌ చెప్పారు. కాల్పులకు కారణమేంటన్నది ఇంకా వెల్లడికాలేదన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.