చార్‌ధామ్‌ యాత్రకు మార్గం సుగమం

ప్రధానాంశాలు

చార్‌ధామ్‌ యాత్రకు మార్గం సుగమం

స్టే ఎత్తివేసిన ఉత్తరాఖండ్‌ హైకోర్టు

నైనీతాల్‌: ప్రఖ్యాత చార్‌ధామ్‌ యాత్రపై గతంలో విధించిన ‘స్టే’ని ఉత్తరాఖండ్‌ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. కొవిడ్‌-19 నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ యాత్ర నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయాలను దర్శించుకునేందుకు ప్రతిరోజూ పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడం వంటి నిబంధనలను పాటించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఆలోక్‌ కుమార్‌ వర్మలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తులు కొవిడ్‌ పరీక్షలో ‘నెగెటివ్‌’ వచ్చినట్లుగా రిపోర్టు, వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌లను తీసుకురావడాన్ని తప్పనిసరి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. చార్‌ధామ్‌ క్షేత్రాల్లో రోజుకు ఏ ఆలయానికి ఎంతమందిని అనుమతించాలో పేర్కొంది. ప్రతిరోజూ కేదార్‌నాథ్‌కు 800, బద్రీనాథ్‌కు 1,200, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మందిని చొప్పున మాత్రమే భక్తులను అనుమతించాలని ధర్మాసనం పరిమితి విధించింది. ఆలయాల పరిధుల్లో ఉన్న నీటి కొలనుల్లో ఎవరినీ స్నానాలకు అనుమతించవద్దని స్పష్టం చేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని