close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా వ్యాక్సిన్‌కు నాలుగేళ్ల సమయం

వచ్చే కొన్నేళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే
ఆరోగ్య సంరక్షణపై పెట్టుబడులు పెంచాలి
కిరణ్‌ మజుందార్‌ షా
దిల్లీ

రోనా వ్యాక్సిన్‌ సిద్ధం కావడానికి చాలా సమయం పడుతుందని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అంచనా వేశారు. కాబట్టి రాబోయే కొన్నేళ్ల పాటు ఈ మహమ్మారి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. ఆరోగ్య సంరక్షణపై మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ఆమె శనివారం జరిగిన ఒక వెబినార్‌లో పేర్కొన్నారు. ‘మొత్తం దేశానికి అందుబాటులోకి వచ్చేలా ఒక సురక్షితమైన వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి చాలా కాలం పాటు వేచిచూడాల్సి వస్తుందని మేం భావిస్తున్నాం. ఎందుకంటే వ్యాక్సిన్‌ అభివృద్ధి అనేది చాలా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని మనం అర్థం చేసుకోవాలి. అత్యంత తక్కువ సమయం అనుకున్నా అందుకు నాలుగేళ్లు పట్టవచ్చ’ని మజుందార్‌ షా పేర్కొన్నారు.

‘ఒక ఏడాదిలోపు దానిని అభివృద్ధి చేయడం అనేది అసాధ్యమైన పనే. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భద్రత, సామర్థ్యం ఉండాలంటే.. పెద్ద స్థాయిలో పలు ప్రక్రియలు ముడిపడి ఉంటాయి. కాబట్టి నమ్మకమైన వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు కొన్నేళ్ల పాటు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆరోగ్యసంరక్షణపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని ఈ కరోనా మనకు నొక్కిచెబుతోంద’ని ఆమె వివరించారు. ‘ఆరోగ్య సంరక్షణ అనేది మూలధనం అవసరమయ్యే రంగం. నైపుణ్యంతో కూడిన, ఉద్యోగాలను ఇచ్చే రంగం కూడా. ఇపుడు ఆరోగ్య మౌలిక వసతుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక అవకాశం కలిగింది. అదే భారత్‌ను, ప్రపంచాన్ని కాపాడుతుంద’ని అన్నారు.

అపోలో హాస్పిటల్స్‌ ఎండీ సునీతా రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ‘వైద్య వసతులను మెరుగుపరచుకోవాలని ఈ మహమ్మారి మనకు చెబుతోంది. ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెరగాలి. కేవలం మౌలిక వసతుల్లోనే కాకుండా.. నైపుణ్యాభివృద్ధిలోనూ పెట్టుబడులను పెంచాల’ని అభిప్రాయపడ్డారు.


అన్‌లాక్‌ 1.0 అనాలి

లాక్‌డౌన్‌ అంటే ఒక నిర్దిష్ట గడువుకే పరిమితం అని అర్థం. ఆ పదాన్ని పరిమిత సమయం వాడాల్సిన అవసరం ఉంది. మనం ఆ పదాన్ని మరచిపోయి.. ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకోవాలి. ‘అన్‌లాక్‌ 1.0’ అంటే ఎలా ఉంటుంది?

- శనివారం ట్విటర్‌లో ఆనంద్‌


మహీంద్రా వ్యాఖ్య మార్గదర్శకాలపై స్పష్టత రావాలి

హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ప్రస్తుతం మార్గదర్శకాలపై స్పష్టత లేదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం’

- ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ)


పరిశ్రమ ఒత్తిడి నుంచి బయటపడుతుంది

ర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు విక్రయ కేంద్రాలు, మాల్స్‌ కార్యకలాపాలను పునఃప్రారంభించడం చాలా ముఖ్యం. లాక్‌డౌన్‌తో పరిశ్రమపై పడిన తీవ్ర ప్రభావం నుంచి బయటపడేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది’

- రిటైలర్స్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ)
- షాపింగ్‌ సెంటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఏఐ)

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.