close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వరుణ దేవా..వలదు వలదు

అత్యవసరమైతేనే బయటకురండి

విద్యుత్తులైన్లు, నియంత్రికల వద్దకు వెళ్లొద్దు

నీళ్లలో ఇరుక్కున్న వాహనాలు తీయొద్దు

 లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి

 పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారుల సూచనలు


పూర్తిగా నీట మునిగిన గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ రోడ్డు

శనివారం సాయంత్రం.. అప్పటి వరకు కాస్తున్న ఎండ మబ్బుల చాటుకు వెళ్లింది. సమయం తీసుకుని.. అప్పుడొకటి అప్పుడొకటి చినుకులు పడటం మొదలైంది. నగరవాసులు ఈ పరిణామాలను గమనిస్తూ భయం భయంగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. కాసేపటికే వర్షం నగరమంతా విస్తరించింది. సుమారు గంటన్నర వ్యవధిలోనే భారీ వర్షపాతం నమోదైంది. నాలుగు రోజుల కిందట జరిగిన పరిణామాలు గుర్తొచ్చి ప్రజల్లో వణుకు మొదలైంది.- ఈనాడు, హైదరాబాద్‌

నాలుగు రోజులుగా అంధకారమే

హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌ పరిధిలోని 17 భవనాలకు, సౌత్‌ సర్కిల్‌లో బార్కాస్‌, చార్మినార్‌ పరిధిలోని కొన్ని కాలనీలకు, సికింద్రాబాద్‌ సర్కిల్‌లోని 8 అపార్ట్‌మెంట్లకు, మరో రెండు కాలనీలకు నాలుగు రోజులుగా విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదు. సరూర్‌నగర్‌, హబ్సిగూడ సర్కిళ్ల పరిధిలోని కరెంట్‌ సమస్యలు కొనసాగుతున్నాయి. శనివారం మలక్‌పేటలో విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మరణించారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం, మజీద్‌పూర్‌ మధ్య శనివారం రాత్రి వాగులో చిక్కుకున్న నెర్రపల్లికి
చెందిన సుధాకర్‌ను ఎస్సై జానకిరామ్‌రెడ్డి బృందం, స్థానికులు కలిసి రక్షించారు. - న్యూస్‌టుడే, అబ్దుల్లాపూర్‌మెట్‌

శివారుల్లో వర్షం శివాలు

నగరంతోపాటు శివార్లలో శనివారం రాత్రి మరోమారు భారీ వర్షం కురిసింది. తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఇంజాపూర్‌, వెంకటేశ్వరకాలనీలను వరద ముంచెత్తింది. బీఎన్‌రెడ్డి నగర్‌ డివిజన్‌ హరిహరపురం కాలనీలో మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది. 14 కాలనీలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. మల్లాపూర్‌ డివిజన్‌ బ్రహ్మపురి కాలనీ, గ్రీన్‌హిల్స్‌ కాలనీ, భవానీనగర్‌, మర్రిగూడ ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. కంచన్‌బాగ్‌ పరిధిలో డీఆర్‌డీఓ సీ బ్లాక్‌ గోడ కూలింది. హఫీజ్‌బాబా నగర్‌లో 40 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

సికింద్రాబాద్‌ మహ్మద్‌గూడలో..

మరోసారి రెండు గేట్లు ఎత్తివేత

బండ్లగూడజాగీర్‌: హిమాయత్‌సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో శనివారం రాత్రి రెండు క్రస్టుగేట్లు అడుగు మేర ఎత్తి ప్రవాహాన్ని మూసీ నదిలోకి వదిలేశారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా జోరువాన మొదలవడంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయంలో నీటిమట్టం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతోంది. అర్ధరాత్రికి వరద పెరిగితే మరిన్ని గేట్లు తెరవనున్నారు.

రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ పోలీసుల సహాయక చర్యలు

నడిరోడ్లపై నరకయాతన

టోలిచౌకి-బృందావన్‌కాలనీ మధ్య వరద నీరు నిలిచి భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. మెహిదీపట్నం, బయోడైవర్సిటీ కూడలి మధ్య రాకపోకలు ఆగిపోయాయి. చాంద్రాయణగుట్ట ఫలక్‌నుమా మధ్య ఆర్‌ఓబీ రోడ్డు కుంగిన ఘటనలో ప్రమాదం తప్పింది. శంషాబాద్‌, ఆరాంఘర్‌ దారుల్లో వాహనాలు కదల్లేదు. పాత కర్నూలు మార్గంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపైనా ఇదే పరిస్థితి. పంజాగుట్ట- ఖైరతాబాద్‌ మధ్య గంటసేపు ట్రాఫిక్‌ స్తంభించింది.

 


గడ్డిఅన్నారం డీసీబీ బ్యాంక్‌ వీధిలో శనివారం రాత్రి ఇద్దరు మహిళలు వరదలో
కొట్టుకుపోతుండగా నరేష్‌ అతని స్నేహితులు కాపాడారు. -న్యూస్‌టుడే, నాగోలు

వర్షపాతం (సెం.మీ.లలో)

ముషీరాబాద్‌ 12.60

ఎల్బీనగర్‌ 16.43

చార్మినార్‌ 13.50

బండ్లగూడ 15.3

నాగోల్‌ 16.95

ఘట్‌కేసర్‌ 18.10

పీర్జాదిగూడ  16.93

షేక్‌పేట 11.70

సైదాబాద్‌ 14.6

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.