close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నన్ను ద్వేషించే వాళ్లకు ఇదే నా జవాబు

తన ఉత్తమ నటనకు కారణం తనను ద్వేషించేవాళ్లేనని అంటోంది కథానాయిక సమంత. తొలినాళ్లలో అందంతో అలరించిన ఆమె.. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో ఒదిగిపోయి పరిపూర్ణమైన నటి అనిపించుకుంది. ఇప్పుడు నాయికా ప్రాధాన్య చిత్రాలతో అలరిస్తూ తనకు తానే సాటి    అనిపించుకుంటోంది. ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ చిత్రాలన్నీ నటిగా ఆమెలోని సరికొత్త కోణాల్ని ఆవిష్కరించాయి. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆమె ట్విటర్లో అభిమానులతో కబుర్లు చెప్పింది.
ఈ లాక్‌డౌన్‌లో తెలుసుకున్న గొప్ప విషయమేంటి?
మీ కలను సాకారం చేసుకునేందుకు నిరంతరం పరుగెత్తాల్సిన పనిలేదు. అమితానందాన్నిచ్చే కల ఇంట్లోనే ఉండొచ్చు. ప్రేమానురాగాలు నిండిన కటుంబంతో గడపడమే ఆ కల కావొచ్చు.
చైతూ కోసం ఏమైనా గరిటె తిప్పారా? ఈ సమయంలో నేర్చుకున్న కొత్త వంటకమేంటి?
అవును అప్పుడప్పుడు చేసి పెట్టా. ఈ విరామంలో షక్‌షుకా అనే కొత్త వంటకం నేర్చుకున్నా.
ఓ సెలబ్రిటీగా మీ జీవితంలో కష్టంగా అనిపించే అంశాలు?
మన గురించి నిజం కాని విషయాల్ని వింటున్నప్పుడల్లా కష్టంగానే అనిపిస్తుంటుంది.
ఈ లాక్‌డౌన్‌లో మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి ఏం చేశారు?
నేను అప్పుడప్పుడు ఉపవాసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. కొన్నిసార్లు బలవంతంగా ఉన్నా కూడా. ఇలా ఎందుకంటే.. నేను తరుచుగా బిర్యానీ లాగిస్తుంటా. అలాగే బాగా కారంగా ఉండే ఆహారాన్ని తింటుంటా. ఇక రోజూ మామిడి పళ్లు సరేసరి. కాబట్టి ఉపవాసం నన్ను మళ్లీ మంచి అమ్మాయిలా మారుస్తుందని నమ్ముతా.
మీ అభిమానులు, మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు?
వాళ్లే నా బలం.. బలహీనత.
బాగా నచ్చిన చిత్రాలు?
‘జోజో ర్యాబిట్‌’. ఈ మధ్య బాగా నచ్చిన చిత్రమిది. చిన్నప్పటి నుంచి నా ఆల్‌టైం ఫేవరెట్‌ సినిమా ‘ద సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’.
మీరు రామ్‌తో కలిసి నటిస్తే చూడాలని   అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?
అమ్మో.. తన ఎనర్జీకీ మ్యాచ్‌ అయ్యేలా చెయ్యాలంటే నేను చచ్చిపోవాలేమో(నవ్వుతూ).
మిమ్మల్ని ద్వేషించే వాళ్లకు మీరిచ్చే సమాధానం?
మీకు తెలియదేమో.. ఒకరకంగా వాళ్లే నాలో స్ఫూర్తిని రగిలిస్తుంటారు. పొగడ్తలెప్పుడూ నన్ను సోమరిని చేస్తే.. అవమానాలెప్పుడూ నాలోని ఉత్తమ నటిని బయటకు తీసేలా ప్రేరేపిస్తుంటాయి. కాబట్టి వారికి నా ధన్యవాదాలు. ఇదే వాళ్లకు నా జవాబు.
ఇంతకీ జిమ్‌లో బాగా వర్కవుట్స్‌ చేసేదెవరు? చైతూనా.. మీరా?
కచ్చితంగా చైతూనే. నేనెక్కువగా చేస్తున్నట్లు నటిస్తాను (నవ్వుతూ). నాగచైతన్య గురించి ఒక్క మాటలో.. తనే నా సంతోషం.
అమల మేడమ్‌ గురించి రెండు మాటలు?
మంచి స్నేహితురాలు. నాకు గొప్ప మార్గదర్శి.
మీ జీవితంలో మీరు అత్యంత గర్వపడే విషయమేంటి?
ఒక వ్యక్తిగా నీకు నువ్వు గర్వపడాలి. నువ్వు నీలా ఉన్నందుకు గర్వపడడం అన్నింటికంటే ముఖ్యం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.