close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముంగిటే ముప్పు!

విచ్చలవిడిగా తిరుగుతున్న జనం
పెరుగుతున్న రద్దీ.. కేసులు కూడా
స్వీయ రక్షణ చర్యలతోనే కరోనా దూరం
ఈనాడు - అమరావతి

కరోనా విజృంభిస్తున్న వేళ స్వీయ రక్షణ చర్యలను చాలా మంది విస్మరిస్తున్నారు. మహమ్మారి నియంత్రణకు పాటించాల్సిన మార్గదర్శకాలను పక్కనబెట్టేశారు. ప్రస్తుతం ఆటోలు, ట్యాక్సీల్లో కిక్కిరిసిన ప్రయాణాలు కొనసాగుతున్నాయి. నగరాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. దుకాణ సముదాయాల్లో చాలాచోట్ల రక్షణ చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగులు కొందరు మాస్కులను ధరించడం లేదు. స్వీయరక్షణ చర్యలు పాటిస్తున్న వారిని బయటి పరిస్థితులు కంగారు పెట్టిస్తున్నాయి. తాజా గణాంకాలు వ్యాధి విజృంభణను తేటతెల్లం  చేస్తున్నాయి.

ముందు జాగ్రత్తలే మందు
ఈ నెల 8 నుంచి ప్రార్థన మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఎక్కువ మంది గుమిగూడే వీటి    వద్ద రక్షణ చర్యలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌ వెసులుబాటును సద్వినియోగపర్చుకోవాల్సి ఉందని వివరిస్తున్నారు. మాస్కులను ధరించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత దూరాన్ని పాటించడం వంటి ముందు జాగ్రత్తలను పాటించాలని పేర్కొంటున్నారు.

లక్షణాలు లేకుండానే జబ్బు
వైరస్‌ వ్యాప్తి ప్రారంభంలో దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను అనుమానిత లక్షణాలుగా వైద్య నిపుణులు తెలిపారు. ఇవేమీ లేకుండానే వైరస్‌ సోకిన కేసులు 60శాతానికిపైగా ఉంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో తేలినప్పటికీ తనలో అనుమానిత లక్షణాలేవీ లేవని, మరోసారి పరీక్షించాలని పట్టుబడుతున్న వారూ ఉన్నారని ఓ వైద్య నిపుణుడు ‘ఈనాడు’కు తెలిపారు. లక్షణాలు లేవంటూ నిర్లక్ష్యంగా ఉండటంకన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యమని తెలిపారు. బయటి పరిస్థితులను చూస్తే వైరస్‌ తీవ్రతపై అవగాహనతో ఉన్నట్లు కనిపించడం లేదని విచారాన్ని వ్యక్తం చేశారు.

విస్తృతికి ఉదాహరణలివి..
* తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని జి.మామిడాడలో ఒకరి నుంచి ఆయన కుటుంబీకులకు, వారి నుంచి ఇతరులకు కలిపి సుమారు 157 మందికి వైరస్‌ సోకింది.
* విజయవాడ మాచవరంలో ఓ కిరాణా వ్యాపారి ద్వారా 30 మందికి వైరస్‌ సోకింది. కృష్ణలంకలో వైరస్‌ సోకిన ఓ వ్యక్తి జూదమాడడం వల్ల 30 మందికిపైగా వైరస్‌ సోకింది.
* కర్నూలులోని తుంగభద్ర నదీ తీరంలో స్వీయరక్షణ చర్యలు తీసుకోకుండా గుంపులుగా యువకులు జూదమాడుతున్నారు. వీరిలో ఏ ఒకరికి వైరస్‌ సోకినా ప్రమాదమే.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.