close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంతర్‌రాష్ట్ర రాకపోకలపై ఆంక్షల తొలగింపు

ప్రయాణాలకు అనుమతులు అవసరం లేదు
బస్సులు మాత్రం అప్పుడే ఉండవు
కంటెయిన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌
దుకాణాలు రాత్రి 8 గంటల వరకే

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఉన్న నిషేధాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. అంతర్‌ రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు మాత్రం ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో కరోనా కంటెయిన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు పొడిగించింది. ఇతర జోన్లలో జూన్‌ 7 వరకు మాత్రమే లాక్‌డౌన్‌ అమలవుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 5వ విడత లాక్‌డౌన్‌కు సంబంధించి శనివారం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సమీక్ష నిర్వహంచారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. పలు అంశాలపై పూర్తిస్పష్టత రాలేదు. ఆలయాలు, ప్రార్థనామందిరాల ప్రారంభం, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతిపై సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఎస్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ వాటి గురించి పేర్కొనలేదు. మెట్రోరైలు, సినిమాహాళ్లు, బార్లు, ఆడిటోరియాలు, ఈత కొలనులు, వ్యాయామ శాలలకు సంబంధించిన ప్రస్తావన లేదు. వీటిపై ఒకటి రెండు రోజుల్లో మళ్లీ స్పష్టత ఇచ్చే వీలుంది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకున్న పలు నిర్ణయాలపై సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు (జీవో నం.42) జారీచేశారు. వెంటనే ఇవి అమల్లోకి వస్తాయని ఆదేశించారు.

ఇవీ ఆదేశాలు
* ఇతర రాష్ట్రాలకు రాకపోకలపై నిషేధం ఎత్తివేత. ప్రయాణాలకు అనుమతులు అవసరం లేదు.
* రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుంది.
* వాణిజ్య సముదాయాలు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించాలి. ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు కొనసాగుతాయి.

అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పుడే కాదు
సరిహద్దు రాష్ట్రాల్లో కేసుల నమోదు అధికంగా ఉండటంతో ప్రస్తుతానికి అంతర్‌ రాష్ట్ర బస్సులను నడపకపోవడమే మంచిదన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు అనుమతివ్వలేదు. ‘‘ఇతర రాష్ట్రాలకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను నడిపే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు వ్యక్తిగత వాహనాలను మాత్రమే అనుమతించాం.’’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‘ఈనాడు’కు చెప్పారు.

ఏపీలోనూ ఇలానే
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతించలేదు. ఏపీలోకి ప్రవేశించే వారికి సరిహద్దుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. కొవిడ్‌ వైరస్‌ ఉన్నట్టు తేలితే వారిని ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచుతారు. నెగెటివ్‌ వస్తే 14 రోజుల హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.