close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక్కరోజే 1,892

ఆలేరు ఎమ్మెల్యేకు కరోనా
మరో 8 మంది మృతి
మొత్తంగా లక్ష దాటిన పరీక్షలు
20 వేలు దాటిన పాజిటివ్‌ కేసులు

ఈనాడు- హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఉద్ధృతమవుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 1,892 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గత మూడు రోజులుగా వరుసగా వెయ్యికి పైగా కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఆలేరు శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇంతకుముందు ముగ్గురు శాసనసభ్యులు కరోనా బారినపడ్డారు. తాజా ఫలితాల్లోనూ జీహెచ్‌ఎంసీలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నట్లుగా వెల్లడైంది. రాష్ట్రం మొత్తంమీద అత్యధికంగా 1,658 కేసులు ఇక్కడే నమోదయ్యాయి. రంగారెడ్డి (56), మేడ్చల్‌ (44), సంగారెడ్డి (20), వరంగల్‌ గ్రామీణ (41) జిల్లాల్లోనూ వైరస్‌ విజృంభిస్తోంది.
మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 20,462కు పెరిగింది. శుక్రవారం నాటి ఫలితాల్లో 24 జిల్లాల్లో పాజిటివ్‌లు గుర్తించారు. అత్యధికంగా 5,965 నమూనాలను పరీక్షించగా, వాటిలో 31.7 శాతం పాజిటివ్‌లు బయటపడ్డాయి. ఇందులో 83,656 మందిలో వైరస్‌ లేదని నిర్ధారణ అయింది.
కోలుకున్నవారు 10,000
రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌లో 9,984 మంది చికిత్స పొందుతుండగా, 1,126 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 10,195 మంది మహమ్మారి నుంచి బయటపడినట్లయింది. కరోనాతో మరో 8 మంది మృతిచెందగా, ఇప్పటి వరకూ మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 283కు పెరిగింది.
ప్రైవేటు ల్యాబ్‌పై వేటు
నిర్ధారణ పరీక్షల్లో ప్రమాణాలు పాటించని ఓ ప్రైవేటు ల్యాబ్‌పై వేటు పడింది. అందులో 3,726 నమూనాలను పరీక్షించగా, 2,672 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. అంటే 71.7 శాతం. ఇంత పెద్దఎత్తున పాజిటివ్‌లే నమోదవడమనేది పరీక్షా విధానంలో లోపాలను తెలియజేస్తోందని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇక్కడి సమాచారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించేంతవరకూ ఈ ల్యాబ్‌లోని పరీక్షల ఫలితాలను పక్కన పెట్టినట్లు పేర్కొంది.
రంగంలోకి ప్రత్యేక ఐఏఎస్‌ల బృందం
రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడి చర్యల్లో ప్రత్యేక ఐఏఎస్‌ల బృందాన్ని ప్రభుత్వం రంగంలోకి దింపింది. కరోనా వెలుగు చూసిన తొలినాళ్లలో కొందరు ఐఏఎస్‌ల సేవలను వినియోగించుకున్నా.. తర్వాత వారంతా తమ శాఖల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పుడు వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో తిరిగి ఐఏఎస్‌ల సేవలను పూర్తిస్థాయిలో నియంత్రణకు ఉపయోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది.
జిల్లాల్లోనూ పరీక్షలు
కరోనా నిర్ధారణ పరీక్షలను నిజామాబాద్‌, గద్వాల, కొత్తగూడెం, కరీంనగర్‌, సూర్యాపేట, ఆసిఫాబాద్‌, మెదక్‌ జిల్లా ఆసుపత్రుల్లోనూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.