close

ప్రధానాంశాలు

రాష్ట్రంలో కొత్తగా 131 పీజీ వైద్య సీట్లు

నిజామాబాద్‌ వైద్యకళాశాలకు అత్యధికంగా 54 సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి కొత్తగా 131 పీజీ వైద్య విద్య సీట్లు మంజూరయ్యాయి. వచ్చే వైద్య విద్య సంవత్సరం(2020-21) నుంచి ఈ పెరిగిన సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అత్యధికంగా నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాలలో 54 పీజీ సీట్లు ఒకే దఫా మంజూరవడం విశేషం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం వైద్య విద్య సంచాలకులకు అనుమతి పత్రాలను పంపింది. తెలంగాణలో ఇప్పటివరకూ(2019-20) మొత్తం 1624 పీజీ వైద్య విద్య సీట్లుండగా.. వీటిల్లో ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 708 సీట్లున్నాయి. ఈ సీట్లలో అఖిల భారత కోటా పరిధిలోకి 343 సీట్లు వెళ్లగా, మిగిలిన సీట్లను కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు. ఈ ఏడాది నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాలకు ఏకంగా జనరల్‌ మెడిసిన్‌(10), అనస్థీషియా(6), అబ్‌స్ట్రీషియా అండ్‌ గైనకాలజీ(6), ఆర్థోపెడిక్స్‌(4), అనాటమీ(4), ఈఎన్‌టీ(3), ఫోరెన్సిక్‌ మెడిసిన్‌(3), ఫిజియాలజీ(2), పిడియాట్రిక్స్‌(3), సైకియాట్రీ(2), ఆఫ్తల్మాలజీ(3), పాథాలజీ(3), మైక్రోబయాలజీ(3), బయోకెమిస్ట్రీ(2) పీజీ సీట్లు మంజూరయ్యాయి. మహబూబ్‌నగర్‌ వైద్యకళాశాల 2020-21 సంవత్సరానికి అనాటమీ(3), బయోకెమిస్ట్రీ(3), ఫిజియాలజీ(3), ఫార్మకాలజీ(3), ఫోరెన్సిక్‌ మెడిసిన్‌(2) విభాగాల్లో కలుపుకొని 14 పీజీ సీట్లు మంజూరయ్యాయి. త్వరలోనే మైక్రోబయాలజీ, పాథాలజీ విభాగాల్లోనూ 3 సీట్ల చొప్పున మంజూరుకానున్నాయి. ఇవికాక ఉస్మానియా (24), గాంధీ (19), ఆదిలాబాద్‌(8), కాకతీయ(12) ప్రభుత్వ వైద్యకళాశాలల్లోనూ పీజీ సీట్లకు కొత్తగా అనుమతులు లభించాయి. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం సీట్లు పెరిగినట్లు వైద్యవర్గాలు చెప్పాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.