close

ప్రధానాంశాలు

కేంద్రం శీతకన్ను

వనరులను పెంపొందించుకోవాలి
వాస్తవికతతో రాష్ట్ర బడ్జెట్‌
మాంద్యాన్ని అధిగమించేందుకు చర్యలు
పట్టణ ప్రగతి తర్వాతే శాసనసభ
విజయాలు శాశ్వతం కావాలి
మంత్రిమండలి సమావేశంలో కేసీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసిందని, అన్నింటా వివక్ష చూపుతోందని సీఎం కేసీఆర్‌ మంత్రిమండలి సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం లేదని, మంజూరు, అనుమతులు, ఆర్థిక సహకారంపై ఆశలు సన్నగిల్లుతున్నాయని పేర్కొన్నట్లు సమాచారం. కేంద్రంపై ఆధారపడకుండా సొంత వనరులను సమకూర్చుకొని ముందుకు సాగాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రభావం ఉన్నా దానిని అధిగమిస్తామని చెప్పారు. ఈసారి బడ్జెట్‌ పూర్తిగా వాస్తవిక ధోరణితో ఉంటుందని వివరించారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు వచ్చేనెల మొదటివారంలో జరుపుతామని ఆయన చెప్పినట్లు తెలిసింది. వరుసగా అన్ని ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి విజయం ప్రజాభిమానానికి నిదర్శనమని అన్నారు. మంత్రిమండలి సమావేశం 7 గంటల పాటు సాగింది.

‘‘కేంద్ర బడ్జెట్‌ మరోసారి నిరాశ మిగిల్చింది. ఇప్పుడు మనం నిరూపించుకోవాలి. ఆర్థిక వ్యవస్థ పూర్తి నియంత్రణలో ఉండాలి. అవసరమైన పనులు, పథకాలకే నిధులు వెచ్చించాలి. అనవసర ఖర్చులు వద్దు. ఇప్పటికే భూముల అమ్మకాల ద్వారా అదనంగా రూ.10 వేల కోట్ల ఆదాయ సమీకరణ చేపట్టాం. మరిన్ని వనరులు అవసరం. ఉమ్మడి రాష్ట్రంలోని పథకాల నిర్వహణపై అధ్యయనంచేసి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి.’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారని తెలిసింది.

అన్ని వర్గాల మద్దతు
‘‘తెలంగాణ ప్రజలు తెరాస వెంట ఉన్నందున శాసనసభ, స్థానిక సంస్థలు, సహకార ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం. పార్లమెంటు ఎన్నికల్లో ఆధిక్యం చాటుకున్నాం. ఇంతటి ఘనత దేశంలో ఏ పార్టీకి లేదు. గ్రామీణ, పట్టణ ప్రజలు, రైతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ శ్రేణులకు అభినందనలు. కేటీఆర్‌కు నా ఆశీస్సులు. ఈ విజయాలు శాశ్వతం కావాలి. భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లోనైనా సంపూర్ణ ఫలితాల దిశగా ప్రణాళిక ఉండాలి. దీనికి అనుగుణంగా పార్టీ యంత్రాంగాన్ని మరింత పటిష్ఠం చేయాలి. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి సాగుతుంది. ఇది ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. మనకు సంపూర్ణ విజయాలను అందించిన ప్రజల రుణం తీర్చుకోవాలి. పది రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పట్టణ ప్రగతి తర్వాత రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తాం’’ అని కేసీఆర్‌ అన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.