close

ప్రధానాంశాలు

ప్రగతి పథంలో పర్యావరణ జపం

  పరిసరాలకు హాని కలగకుండా అభివృద్ధి చెందుతున్నాం
  ‘అతిథి దేవో భవ’ను ఆచరిస్తున్నాం
  వలస జాతుల సంరక్షణ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన

దిల్లీ, గాంధీనగర్‌: పర్యావరణ పరిరక్షణకు భారత్‌ ఎప్పుడూ సముచిత ప్రాధాన్యమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పరిసరాలకు ఏమాత్రం హాని కలిగించకుండానే సుస్థిర అభివృద్ధి పథంలో దూసుకెళ్లే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న ‘వన్యప్రాణి వలస జాతుల సంరక్షణ (సీఎంఎస్‌) ఒప్పందానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాల సదస్సు(కాప్‌)-13’ను ఉద్దేశించి మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు మించనివ్వొద్దన్న పారిస్‌ ఒప్పందం లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్న కొన్ని దేశాల్లో భారత్‌ ఒకటని ఆయన తెలిపారు.

‘‘సుస్థిర అభివృద్ధి పథాన్ని మా ప్రభుత్వం విశ్వసిస్తుంది. పర్యావరణానికి హాని కలిగించకుండా దేశం ప్రగతి మార్గంలో నడిచేలా మేం అన్ని  ‘అతిథి దేవో భవ’ అనే మంత్రాన్ని భారత్‌ అనాదిగా ఆచరిస్తున్న సంగతిని గుర్తుచేశారు. ‘వలస జాతులు భూ ప్రపంచాన్ని అనుసంధానిస్తాయి. కలిసికట్టుగా వాటిని ఆహ్వానిద్దాం’ అన్న ‘సీఎంఎస్‌ కాప్‌ 13’ నినాదంలో ఆ మంత్రం ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌), తూర్పు ఆసియా సదస్సు దేశాలతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్‌ భావిస్తున్నట్లు తెలిపారు. ఇండో పసిఫిక్‌ ఓషన్‌ ఇనిషియేటివ్‌(ఐపీవోఐ)లో తాము నాయకత్వ పాత్ర పోషించనున్నట్లు చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణలో దేశాల మధ్య పరస్పర సహకారం ఎన్నెన్నో సానుకూల ఫలితాలకు దారితీసే అవకాశముందన్నారు. ‘‘జీవ వైవిధ్యాన్ని ఎక్కువగా కలిగి ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. ప్రపంచ పటంలో ఈ దేశ పరిమాణం 2.4% మాత్రమే. కానీ, జీవ వైవిధ్యంలో 8 శాతానికి ఆవాసంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్‌
సీఎంఎస్‌ కాప్‌ సదస్సు అధ్యక్ష బాధ్యతలను ఫిలిప్పీన్స్‌ నుంచి భారత్‌ అధికారికంగా స్వీకరించింది. 2023 వరకు ఈ బాధ్యతల్లో మనదేశం కొనసాగనుంది. మరోవైపు, సీఎంఎస్‌ కింద రక్షణ పొందుతున్నప్పటికీ పలు వలస జీవుల సంఖ్య వేగంగా తగ్గుతోందని తాజా నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.