close

ప్రధానాంశాలు

కృత్రిమ కొరత సృష్టిస్తే పనిపడతాం

నిత్యావసర వస్తువుల ధరలు పెంచొద్దు
ఫిర్యాదుల కోసం 1800 425 00333 టోల్‌ఫ్రీ నంబరు
73307 74444కూ వాట్సప్‌ చేయవచ్చు
పౌరసరఫరాల శాఖ ప్రకటన

కృత్రిమ కొరత సృష్టించి నిత్యావసర వస్తువుల ధరలు పెంచే అక్రమార్కులకు ముకుతాడు వేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధం అయింది. ధరల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఇటు రాష్ట్ర స్థాయిలో అటు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులతో కమిటీలను నియమించింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం అక్రమార్కులపై చర్య తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఎవరైనా ధరలను పెంచి విక్రయిస్తున్నట్లు ప్రజలు గుర్తించిన పక్షంలో టోల్‌ఫ్రీ నంబరు 1800 425 00333కు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే హైదరాబాద్‌లోని చీఫ్‌ రేషనింగ్‌ అధికారి కార్యాలయంలో 040 2344 7770 నంబరుతోపాటు వాట్సప్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేందుకు 73307 74444 నంబరును కేటాయించింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.

- ఈనాడు, హైదరాబాద్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.