close

ప్రధానాంశాలు

‘గాంధీ’... పూర్తిగా కరోనా చికిత్సలకే!

200 ఐసీయూ పడకలు సహా 1500 అందుబాటులోకి
అత్యవసర సేవలు, సర్జరీ విభాగాలు ఉస్మానియాకు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మూడో దశకు చేరక ముందే సర్కారు సన్నద్ధత

ఈనాడు,హైదరాబాద్‌: కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతుండడంతో తెలంగాణ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైరస్‌ మూడో దశకు వ్యాప్తి చెందితే ప్రమాదమన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో కరోనా రోగుల చికిత్సలకే వినియోగించుకోవాలని నిర్ణయించింది. కరోనా వ్యాప్తి కట్టడిపై బీఆర్‌కే భవన్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పై నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిని కరోనా చికిత్స కేంద్రంగా అభివృద్ధి చేయగా, ఛాతీ ఆసుపత్రిలో పాక్షికంగా సేవలందిస్తున్నారు. వీలైనంత త్వరగా గాంధీ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

ఇవీ నిర్ణయాలు
* ప్రస్తుతం గాంధీ బోధనాసుపత్రిలో 36 విభాగాలున్నాయి. ఇందులో 9 నాన్‌ క్లినికల్‌ విభాగాలు మినహా, మిగిలిన 27 విభాగాల్లో అయిదింటిని మాత్రమే గాంధీలో వినియోగించుకోనున్నారు.
* మొత్తం 1500 పడకలు అందుబాటులోకి వస్తాయి. వీటిలో 200 ఐసీయూ పడకలు.
* కరోనా రోగుల చికిత్సకు అవసరమయ్యే జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, నెఫ్రాలజీ, పల్మనాలజీ, కార్డియాలజీ విభాగాలను ఇక్కడే కొనసాగిస్తారు.
* గైనకాలజీ, జనరల్‌ సర్జరీ, ఆర్ధోపెడిక్స్‌, ఆఫ్తల్మాలజీ, ఈఎన్‌టీ, న్యూరాలజీ, తదితర విభాగాలన్నింటినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారు.
* ఇకపై సాధారణ ఓపీతో పాటు అత్యవసర చికిత్స అవసరమైన వారు కూడా ఉస్మానియాకే వెళ్లాల్సి ఉంటుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.